Telangana

News August 19, 2024

స్పీకర్‌కు రాఖీ కట్టిన మంత్రి సీతక్క

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు మంత్రి సీతక్క సోమవారం రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మంత్రి సీతక్కతో పాటు నారాయణపేట, సత్తుపల్లి శాసనసభ్యులు చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయిలు తదితరులు రాఖీలు కట్టారు.

News August 19, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి.

News August 19, 2024

చిట్యాల: చెట్టుకు ఢీకొని యువకుడు మృతి

image

బైక్ చెట్టును ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందిన ఘనట పేరేపల్లి శివారులో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం… చిట్యాల మండలం పేరేపల్లికి చెందిన రూపని రాజశేఖర్ జేసీబీ డ్రైవర్. వెలిమినేడులో పని ముగించుకుని గ్రామానికి తిరిగి వెళుతుండగా పేరేపల్లి శివారులో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతుడి తమ్ముడు రాముడి  ఫిర్యాదుతో ఏఎస్ఐ జానారెడ్డి కేసు నమోదు చేశారు.

News August 19, 2024

DMHOగా డాక్టర్ వి.సుబ్బారావు

image

ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ వి.సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన మాలతిపై ఆరోపణలు రీత్యా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ డిపార్ట్మెంట్‌కి సరెండర్ చేశారు. ఈ సందర్బంగా వైద్యా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సుబ్బారావుకి అదనపు భాద్యతలు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

News August 19, 2024

NZB: రాఖీ ఎఫెక్ట్.. కిక్కిరిసిన బస్టాండ్లు

image

రాఖీ వేళ ఉమ్మడి NZB జిల్లాలోని బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి. సోదరులకు రాఖీలు కట్టడానికి పుట్టింటికి వచ్చిన సోదరీమణులు తిరిగి ప్రయాణమవుతున్నారు. దీంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచినప్పటికీ తమకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక్కో బస్సు కోసం సుమారు గంటల వరకు వేచి చూడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News August 19, 2024

తార్నాక: సీఎంకు రాఖీ కట్టిన డిప్యూటీ మేయర్

image

రాఖీ పౌర్ణమి సందర్భంగానగర్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సోదరుడిలా అన్నివేళలా తనకు అండగా ఉంటానన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని మహిళలకు అన్నివేళలా రక్షణగా ఉంటుందన్నారు.

News August 19, 2024

రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావుకు బిజెపి మహిళ నాయకురాళ్లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయత, అనురాగాలను పంచుతుందన్నారు. బేదాభిప్రాయాలను దూరం చేస్తుందన్నారు. మహిళలందరికీ రఘునందన్ రావు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

News August 19, 2024

నెల్లికల్ ఫారెస్ట్‌లో అనుమానాస్పద మృతి

image

నాగార్జునసాగర్ నెల్లికల్ ఫారెస్ట్ అటవీ ప్రాంతంలో పగడాల సుధాకర్ అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వేములపల్లి మండలం శెట్టిపాలెంకి సుధాకర్ ఓ కంపెనీలో క్యాష్ డిపాజిటర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఏటీఎంలో మనీ డిపాజిట్ చేసే క్రమంలో రూ.20లక్షలతో ఈ నెల 13న ఉడాయించాడని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదు చేశారు. ఫారెస్టులో ఇవాళ శవమై తేలాడు. 

News August 19, 2024

రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు, బ్రహ్మకుమారీలు

image

రక్షాబంధన్ వేడుకను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్లోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు సోమవారం ఉన్నతాధికారులకు రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు సైతం అధికారులకు రాఖీలు కట్టారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్ తదితర అధికారులకు రాఖీలు కట్టి రక్షా బంధన్ ప్రాశస్త్యాన్ని చాటారు.

News August 19, 2024

MDK: ‘రుణమాఫీపై సందేహాలు, విజ్ఞప్తులు స్వీకరించాలి’

image

రైతు రుణమాఫీకి సంబంధించి సమస్యలు, సందేహాల నివృత్తి కోసం వచ్చే విజ్ఞప్తులను స్వీకరించాలని మండల వ్యవసాయ అధికారులను మెదక్ జిల్లా వ్యసాయాధికారి గోవింద్ ఆదేశించారు. రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందిగా ఆదేశించారు.