India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పరకాల పట్టణ కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గౌడ కులస్థులకు కాటమయ్య కిట్ల పంపిణీ చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.

సబ్బండవర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

వెంకటాపురం మండలంలోని నూగురులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకేరోజు ఏడుగురిపై దాడి చేయడంతో బాధితులను వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఎటూరునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో మనుషులు, పశువులపై కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.

HYD మెట్రో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఇబ్బందులకు గురైతే వాటి వివరాలను వాట్సాప్ ద్వారా తెలపాలని అన్నారు. మెట్రోలో ఏసీ సరిగా రావడం లేదని ఓ వ్యక్తి తెలపగా, ప్రస్తుతం మెట్రోలో ఏసీ 22-24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంచుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. వాట్సాప్ నంబర్ 7995999533 ద్వారా సమస్యలు తెలపాలని కోరారు. SHARE IT

పెళ్లి చూపులకు వెళ్లిన యువకుడు మృత్యువాత పడిన వార్త స్థానికంగా కంట తడి పెట్టించింది. స్థానికులు తెలిపిన వివారలు.. మునగాలలోని నేలమర్రికి చెందిన సురేష్ తన బైక్‌పై ఆదివారం ఉదయం సూర్యాపేటకు బయలు దేరాడు. మాధవరం వద్ద సూర్యాపేట నుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం సూర్యాపేటకు తరలించారు.

కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన నవీపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం కారులో బాసర వెళ్తుండగా నవీపేట మండలం అబ్బాపూర్ వద్ద అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

HYDలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నూతన టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ ద్వారా వరదల్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అధికారులు తెలిపారు. దీనిని తాడుతో పంపుతారని, 100 కేజీల బరువు వరకు లాగుతుందని తెలిపారు. రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది.

HYD మెట్రో జోన్ పరిధిలో 18, రంగారెడ్డి జోన్ పరిధిలో 25, మేడ్చల్ జూన్ పరిధిలో 18 చొప్పున కొత్తగా 33KV ఉపకేంద్రాలను ఏర్పాటుకు చీఫ్ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళిక రచించారు. గృహ, వాణిజ్య, మాల్స్ నిర్మాణాల దూకుడుతో విద్యుత్ వినియోగం ఏటేటా పెరుగుతుండడంతో రాబోయే రోజుల్లో డిమాండ్ తట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు స్థలాలను కేటాయించాలని కలెక్టర్లకు ఇంజినీర్లు లేఖ రాశారు.
Sorry, no posts matched your criteria.