Telangana

News August 21, 2024

MBNR, NGKL జిల్లాల్లో రేపు రేపు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

image

మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో రేపు ఉదయం నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో MBNR,NGKL జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది. నేడు ఉదయం పలుచోట్ల వర్షాలు పడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు సూచించారు.

News August 21, 2024

జేపీసీ కమిటీ తొలి సమావేశానికి బయలుదేరిన ఎంపీ

image

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎంపీ డీకే అరుణ సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి (JPC) తొలి భేటీలో పాల్గొనేందుకు ఆమె బుధవారం ఢిల్లీకి బయలుదేరారని ఆమె అనుచరులు తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలు, లోపాలు, రాష్ట్రాల వారీగా వక్ఫ్ భూముల వివరాల పర్యావసానాలు చర్చించనున్నారని, రేపు 11 గంటలకు పార్లమెంట్ హౌస్ లో తొలి భేటీలో పాల్గొన్నారు.

News August 21, 2024

నిర్మల్: ఈ నెల 24న జాబ్ మేళా

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 24 ఉదయం 9 గంటలకు HCL టెక్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO జాదవ్ పరుశురాం తెలిపారు. 2024 సంవత్సరంలో 75% మార్కులతో ఉత్తీర్ణులైన HEC, CEC విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

News August 21, 2024

అర్హులైన పేదలందరికీ ఇతర చోట్ల పట్టాలిస్తాం: రామగుండం MLA

image

గోదావరిఖని గంగానగర్ సమీపంలో ఎస్టీపీల నిర్మాణానికి అక్కడ గుడిసెలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో గుడిసెల వాసులు వారి సమస్య పరిష్కరించాలని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అరులైన పేదలందరికీ ఇతర చోట్ల పట్టాలు ఇస్తామని హమీ ఇచ్చారు. రామగుండం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాని ప్రజలు సహకరించాలని కోరారు.

News August 21, 2024

HYD: ప్రతి ఏటా కొత్తగా 15,000 క్యాన్సర్ కేసులు!

image

HYD నగరంలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా కొత్తగా సుమారు 15,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రతి సంవత్సరం మేజర్ సర్జరీలు 4500, మైనర్ సర్జరీలు 6000, రేడియేషన్ థెరపీలు దాదాపు 300 మందికి జరుగుతున్నాయి. కీమోథెరపీ చికిత్సలు సైతం 300 మందికి జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 1.5 లక్షల మందికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News August 21, 2024

HYD: ఏటా కొత్తగా 15,000 క్యాన్సర్ కేసులు!

image

HYD నగరంలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రతి ఏటా కొత్తగా సుమారు 15,000 క్యాన్సర్ కేసులు నమోదవుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఏటా మేజర్ సర్జరీలు 4,500, మైనర్ సర్జరీలు 6,000, రేడియేషన్ థెరపీలు దాదాపు 300 మందికి జరుగుతున్నాయి. కీమోథెరపీ చికిత్సలు సైతం 300 మందికి జరుగుతున్నట్లు తెలిపారు. దాదాపుగా 1.5 లక్షల మందికి వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

News August 21, 2024

కలెక్టర్‌ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మున్సిపల్ కమిషనర్

image

కరీంనగర్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పాయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు‌. అనంతరం చాహత్ బాజ్‌పాయ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేల సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని పలు సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.

News August 21, 2024

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు వివరాలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు (బిల్టీ) క్వింటాకు రూ. 2780, పసుపు ధర రూ.12,273 పలికింది. అలాగే సూక పల్లికాయ ధర రూ.6,260 పలకగా.. పచ్చి పల్లికాయ ధర రూ.4,200 పలికింది. మరో వైపు 5531 రకం మిర్చికి రూ.12 వేల ధర వచ్చినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

News August 21, 2024

అదిలాబాద్: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహం పై పోలీసులు దాడి చేశారు. స్టేషన్ పరిధిలోని ద్వారకనగర్ కాలనీలో వ్యభిచారం జరుగుతుందన్న పక్క సమాచారంతో సీసీఎస్ పోలీసులు బుధవారం దాడిచేశారు. వ్యభిచార గృహంలో ఉన్న ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News August 21, 2024

HYD: 2 వేల మందితో భారీ ర్యాలీ

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం ఘటనను నిరసిస్తూ శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అన్ని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు (దాదాపు 2 వేల మంది) ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ RBనగర్ నుంచి మధురానగర్, HYD- బెంగళూరు రహదారి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.