Telangana

News August 18, 2024

HYD: కూకట్‌పల్లిలో వ్యభిచారం.. పోలీసుల రైడ్స్  

image

స్పా ముసుగులో వ్యభిచారం, అనుమతులు లేకుండా స్పా నిర్వహిస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. కూకట్‌పల్లి KPHB నాలుగో రోడ్డులో స్పార్కిల్ పేరిట స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఏహెచ్‌టీయూ బృందం శనివారం కేంద్రంపై దాడి చేసింది. ఐదుగురు మహిళలు, టెలికాలర్, మేనేజర్, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని KPHB పోలీసులకు అప్పగించారు.

News August 18, 2024

డయల్‌ 100 కాల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి: కరీంనగర్ సీపీ

image

డయల్‌ 100 కాల్స్‌తో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీ అభిషేక్‌ మొహంతి అన్నారు. కమిషనరేట్‌ కేంద్రంలో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి రవాణాపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి NDPS చట్టం ద్వారా కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు.

News August 18, 2024

KTRకు నాలెడ్జ్ లేదు.. హరీశ్‌రావువి చిల్లర మాటలు: కోదండరెడ్డి

image

రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

News August 18, 2024

NLG: పాన్ షాపులన్నీ బంద్

image

నల్గొండ జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం ఆదర్శంగా నిలిచింది. డ్రగ్స్ నివారణే ధ్యేయంగా రామాలయంలో యువకులు సమావేశం నిర్వహించారు. గ్రామంలోని పాన్ షాపులన్నీ మూసి వేయాలని తీర్మానించారు. పాన్‌షాప్ యజమానులకు 2రోజుల గడువు ఇచ్చి తీసివేయాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

News August 18, 2024

మహబూబ్‌నగర్: PU పరిధిలో 19న జరిగే పరీక్షలు వాయిదా

image

PU పరిధిలో ఈనెల 19న జరిగే పీజీ, బీఈడీ, ఫార్మసీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు PU పరీక్షల నియంత్రణ అధికారి డా. రాజకుమార్ శనివారం ఓ ప్రకటనలు తెలిపారు. సోమవారం రాఖీ పండుగ సందర్భంగా జరిగే పరీక్షలను వాయిదా వేశామన్నారు. 19న జరిగే పరీక్షలను 23వ తేదీన జరుగుతాయని రీ షెడ్యూల్‌ను శనివారం యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు.

News August 18, 2024

నల్గొండ జిల్లాలో ముమ్మరంగా జ్వర సర్వే

image

నల్గొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. గడిచిన 2 రోజుల్లో 1,29,046 ఇళ్లల్లో 4,77,113 మందిని పరీక్షించారు. వీరిలో 1,228 మందికి జ్వరం లక్షణాలు కనిపిచడంతో 520 కిట్ల ద్వారా డెంగి పరీక్షలు చేశారు. వారిలో ఇద్దరికి మాత్రమే డెంగి ఉన్నట్లు గుర్తించగా.. మరి కొంతమందికి మలేరియా, చికెన్ గున్యా ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

News August 18, 2024

HYD: ఈనెల 20న టీహబ్‌లో ప్రత్యేక సమావేశం

image

హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్‌లో ఈనెల 20వ తేదీ మ.3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ టెక్ (ఎస్ఏడబ్ల్యూఐటీ), టీహబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ‘ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇన్స్టూ డిప్లొయింగ్ జనరేటివ్ ఏఐ మోడల్స్’ అనే అంశంపై సమావేశం జరగనుందన్నారు.

News August 18, 2024

HYD: ఈనెల 20న టీహబ్‌లో ప్రత్యేక సమావేశం

image

హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీ హబ్‌లో ఈనెల 20వ తేదీ మ.3.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సౌత్ ఏషియన్ విమెన్ ఇన్ టెక్ (ఎస్ఏడబ్ల్యూఐటీ), టీహబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ‘ప్రాక్టికల్ ఇన్సైట్స్ ఇన్స్టూ డిప్లొయింగ్ జనరేటివ్ ఏఐ మోడల్స్’ అనే అంశంపై సమావేశం జరగనుందన్నారు. 

News August 18, 2024

కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?

image

కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.

News August 18, 2024

కొనసాగుతున్న రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికల పోలింగ్

image

రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఆదివారం
బాన్సువాడ మార్కండేయ మందిరంలో పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ బాన్సువాడ పద్మశాలి సంఘం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జంగం గంగాధర్, బాన్సువాడ పద్మశాలి సంఘం అధ్యక్షులు జిల్లా కాశీనాథ్, గొంట్యాల బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.