India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మనూలో నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ)లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రవేశాలను కల్పిస్తామని ‘మనూ’ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ వనజ సోమవారం తెలిపారు. ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. బీఎడ్(సెకండరీ) బీఎస్సీ బీఎడ్(ద్వితీయ) బీకామ్ బీఈడీ (సెకండరీ) కోర్సులకు దరఖాస్తులను కోరుతున్నామన్నారు. అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీ వరకు అడ్మిషన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

రంగారెడ్డి జిల్లా నేషనల్ కెరీర్ సర్వీసెస్, డాన్ బాస్కో దిశ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎన్పీఎస్ అధికారి విజయ్ కుమార్ సోమవారం తెలియజేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తామన్నారు.

కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన యడవల్లి వెంకటస్వామిని AICC నియమించడంపై తెలంగాణ విద్యార్థి నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. వెంకటస్వామిని తొలగించాలని, తెలంగాణ వ్యక్తికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని డిమండ్ చేశారు.

రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండడమే చారిత్రక న్యాయమని పలువురు కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్ హరగోపాల్, అల్లం నారాయణ, గోరటి వెంకన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, నందిని సిధారెడ్డి, శ్రీధర్, దేశపతి శ్రీనివాస్, ఘంటా చక్రపాణి, తిగుళ్ల కృష్ణమూర్తి, ఏలె లక్ష్మణ్ తదితరులు సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు.

భారాస ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు, రూ. 40 వేల కోట్ల బకాయిలు మిగిల్చిందని.. అవి భారంగా మారినా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేసి రైతుల పక్షాన నిలిచిందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘నిబంధనల ప్రకారం స్పష్టంగా ఉన్న బ్యాంకు ఖాతాలకు వెంటనే రుణమాఫీ అమలు చేశాం. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల ఆధార్, పాస్ పుస్తకాల సమాచారం గందరగోళంగా ఉంది’ అన్నారు.

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.

ఓపీ చీటి కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద లైన్‌లో గంటలకొద్ది నిలబడతాం. ఉస్మానియా, గాంధీ, ఎంఎన్‌జే, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో 2 నిమిషాల్లోనే ఓపీ చీటి పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని డాక్టర్ రాజేంద్రనాధ్ అన్నారు. ‘అభా’ యాప్‌తో క్యూలైన్ కష్టాలు తీరనున్నాయి. ఓపీ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అభా యాప్‌లో వివరాలు నమోదు చేస్తే ఓపీ చీటీ వస్తుంది. దీన్ని డాక్టర్లకు చూపించి సేవలు పొందొచ్చు.

బోరబండలో న్యాయవాది సంతోష్‌ను పోలీసులు వేధింపులకు గురిచేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని సీపీ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 16న బోరబండలో న్యాయవాది నివాసం వద్ద, ఠాణాలో పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించారన్నారు. బోరబండ, మధురానగర్ ప్రాంతాల్లో రౌడీల చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించటానికి పోలీసులు చట్టప్రకారమే ప్రవర్తిస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.