India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు, ట్రాఫిక్ అధికారులతో DGP డా.జితేందర్ సమావేశమై, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, ఇతర సమస్యలపై చర్చించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ పరిస్థితి, ట్రాఫిక్ రద్దీకి గల కారణాలు, రద్దీని తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు.

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. WGL-నర్సంపేట రోడ్డులోని గీసుగొండ మండలం కొనాయమాకుల వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న రంజిత్, వెంకటనారాయణ మృతి చెందారు. పెళ్లి పత్రికలు పంపిణీ చేసి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులు హనుమకొండ జిల్లా ఐనవోలు వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా ములుగు(M)కి చెందిన భానుప్రియ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం పిల్లలతో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నిన్న రాత్రి శామీర్‌పేట చెరువులో వేదాంశ్(5), భానుప్రియ మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను మంగళవారం వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ శనివారం తెలిపారు. ప్రతినెలా 15 వరకే రేషన్ పంపిణీ చేసేవారని, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం నెలకొన్నందున ఈనెల 20 వరకు అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు. ఈమేరకు రేషన్ దుకాణాల్లోని ఈపాస్ యంత్రాల్లో మార్పులు చేశామన్నారు.

డీసీసీబీ పరిధిలోని సహకార సంఘాల ద్వారా కొత్త రైతులకు వానాకాలం సీజన్‌లో రూ.90 కోట్లు పంట రుణాలు ఇస్తామని బ్యాంక్ ఛైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డీసీసీబీ కింద 89,888 మంది రైతులకు రూ.499.48 కోట్లు రుణమాఫీకి ప్రభుత్వానికి నివేదిక పంపగా.. 52,708 మంది రైతులకు రూ. 279.76 కోట్లు వచ్చాయన్నారు. వచ్చేవారం రుణమాఫీపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాని వారికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంజినీర్లు, మేధావులు, ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల నుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్.. ఆ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా కొందరికి సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో శనివారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. అచ్చంపేట క్లబ్ వద్ద పులి కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోనే నవోదయ, మోడల్ పాఠశాలలు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే పులి జాడ కనిపెట్టాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.

☛ అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
☛ కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
☛ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
☛ వైరాలో ఉచిత వైద్య శిబిరం
☛ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
☛ అశ్వరావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
☛ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌లోకి వరద పెరిగిందని, దీంతో నీటిని దిగువకు వదిలామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ఫ్లో 1,538 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలామని చెప్పారు.

భారీ వర్షాల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు శనివారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్‌లోకి వరద పెరిగిందని, దీంతో నీటిని దిగువకు వదిలామని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. ఇన్‌ఫ్లో 2,075 క్యూసెక్కులు కాగా.. అవుట్‌ఫ్లో 1,538 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.