India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉల్లి, అల్లం తీస్తున్నారని, ఇప్పుడు బ్రేక్ డాన్సులు చేసుకోమని అవమానపరిచిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రుణమాఫీ అందరికీ కాలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్పుకుంటోందని BRS నేత, నారాయణఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ఎవ్వరిని అడిగినా రుణమాఫీ కాలేదనే చెబుతున్నారని, మరి ఎవరికి మాఫీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదని, పథకాలు అందించిన BRS కావాలా.. మోసం చేసిన కాంగ్రెస్ కావాలా అని అడిగారు.

చర్ల సరిహద్దు ప్రాంతం సుక్మా జిల్లా పువర్తికి చెందిన 16 ఏళ్ల శంకర్‌ను మావోయిస్టులు దారుణంగా కొట్టి చంపారు. పల్నార్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్.. పోలీస్ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నట్లు నక్సల్స్ అనుమానించారు. బుధవారం అర్ధరాత్రి అతడి ఇంటికి చేరుకున్న మావోయిస్టులు శంకర్ ను కొద్దిదూరం తీసుకెళ్లి మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ వాహినితో పాటు పలు సంఘాలు ఈ నెల 17 న బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ.. హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. బంద్‌ను సంపూర్ణం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

నిజామాబాద్ ట్రాఫిక్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకం లభించింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధి రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ ACP నారాయణకు పోలీస్ సేవా పతకాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శిరీష(30) అనే గర్భిణీ ప్రసవం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. అయితే ప్రసవించిన కొద్ది గంటల్లోనే తల్లీ కుమార్తెలు మరణించారు. డెంగ్యూ లక్షణాలతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.

జడ్చర్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఓ విద్యార్థినికి షూ వేశారు. జడ్చర్ల నియోజకవర్గంలో విద్యార్థులకు బూట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినికి ఆయన స్వయంగా బూట్లు తొడిగి అందరిని ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే నిరాడంబరతకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్రం దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 140 మందికి ఉద్యోగులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, MLA విజయరమణారావుతో కలిసి అందజేశారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఓ అధికారి తన సబార్డినేట్‌తో బూట్ల మోయించిన ఘటన గురువారం బాన్సువాడలో జరిగింది. తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓ రమేశ్ రాథోడ్ బూట్లు వేసుకొని జెండా గద్దె వద్దకు వెళ్లాడు. ఆ తరువాత పొరపాటు తెలుసుకొని బూట్లు విడిచి అటెండర్‌తో పంపించారు. జెండా సాక్షిగాపై అధికారి బూట్లను అటెండర్ మోయించడంతో చర్చనీయాంశంగా మారింది.

మెదక్ డైట్‌లో అతిథి అధ్యాపకులుగా 16 పోస్టులు ఉన్నాయని, వాటికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్ డీఈవో రాధాకిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లోని వివిధ విభాగాల్లో 16 పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 21వ తేదీలోగా డైట్‌లో అందజేయాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.