Telangana

News August 12, 2024

HYD: వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

image

వేణు స్వామిపై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్‌కు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫిల్మ్ సెలబ్రెటీస్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. సినిమా వారి జాతకాలు చెబుతూ పాపులర్ అయిన వేణు నాగచైతన్య-శోభిత ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషిస్తూ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

News August 12, 2024

HYD: ముందుకు సాగని ఎలివేటెడ్‌ కారిడార్ పనులు..!

image

హైదరాబాద్‌ నగరానికి ప్రతిష్ఠాత్మకమైన 2 ఎలివేటెడ్‌ కారిడార్ల ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఓ వైపు రక్షణ శాఖ నుంచి తీసుకున్న భూములకు పరిహారం, ఇతర ప్రాంతాల్లో భూముల బదలాయింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ఇక ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తి స్థాయి అంచనాకు ప్రభుత్వం రాలేకపోయింది. కనీసం టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదు.

News August 12, 2024

HYD: రాష్ట్రపతి భవన్ నుంచి స్టూడెంట్ ఆకర్షణకు పిలుపు

image

ఈనెల 15 ఇండిపెండెన్స్‌డేన రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణకు ఆహ్వానం అందింది. అనాథాశ్రమాలు, స్కూళ్లల్లో సొంతంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ‌ను ఇటీవల ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఇప్పటివరకు 14 లైబ్రరీలను ఆకర్షణ ఏర్పాటు చేసిందని, మరిన్ని పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉందని తండ్రి సతీష్ తెలిపారు.

News August 12, 2024

HYD: రాష్ట్రపతి భవన్ నుంచి ఆకర్షణకు పిలుపు

image

ఈనెల 15 ఇండిపెండెన్స్‌డేన రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమానికి రావాల్సిందిగా 8వ తరగతి స్టూడెంట్ ఆకర్షణకు ఆహ్వానం అందింది. అనాథాశ్రమాలు, స్కూళ్లల్లో సొంతంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ‌ను ఇటీవల ప్రధాని మోదీ కూడా అభినందించారు. ఇప్పటివరకు 14 లైబ్రరీలను ఆకర్షణ ఏర్పాటు చేసిందని, మరిన్ని పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉందని తండ్రి సతీష్ తెలిపారు.

News August 12, 2024

వరంగల్: ‘సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు పెట్టొద్దు’

image

వరంగల్ గ్రేన్ మార్కెట్ గేట్ హైస్కూల్లో షీ టీం ఆధ్వర్యంలో పిల్లలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేరాలు, అకృత్యాలు పెరుగుతున్న కాలంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పెట్టకూడదని చెప్పారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 1930కి తెలపాలన్నారు.

News August 12, 2024

HYD: కాంగ్రెస్ అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోంది: MLA

image

తెలంగాణలో సాధారణ సాగు 1.29 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి ఆగస్టు 10 నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవ్వడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదని, విత్తనాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని హితువు పలికారు.

News August 12, 2024

హరీశ్‌రావుకి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

image

రుణమాఫీపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాలమైతే మీ ఖాతాలో.. కరవు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజాం మీ పార్టీదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదని ఆరోపించారు. సాంకేతిక సమస్యలు చూపించి రైతులకు రుణాలు మాఫీ చేయలేదని, ఈ విషయం హరీశ్ రావుకి తెలుసని మండిపడ్డారు.

News August 12, 2024

HYD: కాంగ్రెస్ అసమర్ధత స్పష్టంగా కనిపిస్తోంది: MLA

image

తెలంగాణలో సాధారణ సాగు 1.29 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి ఆగస్టు 10 నాటికి కేవలం 84.6 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగవ్వడం కాంగ్రెస్ అసమర్ధ పాలనకు నిదర్శనం అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు. ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదని, విత్తనాల పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని పాలన సాగించాలని హితువు పలికారు.

News August 12, 2024

WGL: స్వల్పంగా పెరిగిన పల్లికాయ, పసుపు ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌కి నేడు పసుపు, పల్లికాయ తరలివచ్చాయి. క్వింటా సూక పల్లికాయకి రూ.6,450, పచ్చి పల్లికాయకు రూ.4,050 ధర వచ్చింది. అలాగే పసుపు క్వింటా రూ.14,011 ధర, 5531 రకం మిర్చి రూ.11,500 ధర పలికిందని వ్యాపారులు తెలిపారు. అయితే మొన్నటితో పోలిస్తే నేడు అన్ని రకాల సరకుల ధరలు స్వల్పంగా పెరిగాయని అధికారులు తెలిపారు.

News August 12, 2024

నిజాంసాగర్: జాతీయ రహదారిపై కారు బోల్తా

image

నిజాంసాగర్ మండలంలో సోమవారం జాతీయ రహదారి 161లో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్‌రావుపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 161లో హైదరాబాదు నుంచి పిట్లం వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.