Telangana

News August 29, 2024

ప్రతి జిల్లాలో హైడ్రాను అమలు చేస్తాం: మంత్రి పొన్నం

image

రాష్ట్రవ్యాప్తంగా చెరువుల, నాలాల ఎఫ్‌టీఎల్‌‌లో నిర్మించిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. ఎంత వారినైనా ఉపేక్షించకుండా ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.

News August 29, 2024

శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనర్ మడికొండలోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ముందుగా ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీస్ చట్టాలను బోధించే తరగతి గదులను సందర్శించారు. శిక్షణ సమయంలోనే పోలీస్ చట్టాలపై పట్టు సాధించాలని సీపీ సూచించారు. బోధనకు సంబంధించి ప్రతి అంశంపై పట్టు ఉండాలని, తద్వారా విధులు నిర్వహించే సమయంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని తెలిపారు.

News August 29, 2024

BREAKING: నాగిరెడ్డిపేట తహశీల్దార్ SUSPEND

image

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహశీల్దార్‌ లక్ష్మణ్ అవినీతికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ 15 రోజులుగా రైతులు MRO ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందిస్తూ ఎల్లారెడ్డి RDO మన్నే ప్రభాకర్ విచారణ జరిపారు. అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని RDO తెలిపారు.

News August 29, 2024

MDK: రూ.3.75 కోట్ల విలువైన మత్తు పదార్థాలు కాల్చివేత

image

పటాన్‌చెరు మండలం పాశం మైలారం పరిధిలోని మెడికేర్ పరిశ్రమలో జిల్లా డ్రగ్ డిస్పోజబుల్ కమిటీ ఆధ్వర్యంలో రూ.3.75 కోట్ల విలువైన ఆల్ఫాజోలం, గంజాయిని గురువారం దహనం చేశారు. ఇన్సినిరేషన్ ప్రక్రియ ద్వారా పర్యావరణ కాలుష్య నియంత్రణను పాటిస్తూ దహనం చేసినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు రవీందర్ రెడ్డి సత్తయ్య పాల్గొన్నారు.

News August 29, 2024

వరంగల్ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి మళ్లీ వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య నేపథ్యంలో మార్కెట్‌ను మూసి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News August 29, 2024

సిరిసిల్ల జిల్లాలో మహిళలకు కోళ్ల పంపిణీ

image

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ముస్తాబాద్, కోనరావుపేట, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్, బోయినపల్లి, గంభీరావుపేట, చందుర్తి మండలాల్లో 5,500 సోనాలి బ్రీడ్ కోళ్లు పంపిణీ చేశామని రాజన్న సిరిసిల్ల డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. ఆయా మండలాల్లో 80 మంది మహిళల ఆర్థిక స్వావలంబనలో భాగంగా వారు పెంచుకునే స్థలాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి 35 నుంచి 50 కోళ్లు పంపిణీ చేశామన్నారు.

News August 29, 2024

వరంగల్ మార్కెట్లో చిరు ధాన్యాల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు వివిధ రకాల చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ ధర రూ.5,910 పలకగా పచ్చి పల్లికాయ ధర రూ.3500 పలికింది. మరోవైపు పసుపు కి రూ.11,885 ధర రాగా, 5531 రకం మిర్చికి నిన్న రూ.13,500, టమాటా రకం మిర్చికి రూ.19 వేల ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News August 29, 2024

వరంగల్ సీపీకి హైకోర్టు షోకాజ్ నోటీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు హైకోర్టు షోకాజు నోటీసులు పంపించింది. యాదాద్రి అనే వ్యక్తి వరంగల్ కమిషనరేట్‌లో పని చేసి ఉద్యోగ విరమణ పొంది, పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పింఛను ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని అతడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో సీపీ లేదా ఆయన తరఫు న్యాయవాది సెప్టెంబర్ 6న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News August 29, 2024

సీజనల్ వ్యాధుల పై దామోదర్ రాజనర్సింహ సమీక్ష

image

హైదరాబాదులోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ ఫీవర్, డెంగ్యూ నియంత్రణపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News August 29, 2024

ఎంబీఏ పరీక్షా జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షల జవాబు పత్రాల నకలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి వచ్చేనెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.