India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లు నిర్వహించొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. HCA అపెక్స్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ప్రకటన ఆధారంగా ఎలాంటి మ్యాచ్లు నిర్వహించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆటగాళ్ల ఎంపిక నిమిత్తం లీగ్ మ్యాచ్లను నిర్వహించేందుకు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనను సవాలు చేస్తూ హైదరాబాద్ చార్మినార్ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించింది.

భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టబద్ధమైనదని హైకోర్టు తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బోర్డు ఛైర్మన్, మెంబర్స్ దాఖలు చేసిన అప్పీలును డిస్మిస్ చేసింది. అంతేకాకుండా ప్రత్యేక అధికారిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నియామకాన్ని సమర్థించింది. బోర్డు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది.

మద్నూర్‌లో తండ్రిని చంపిన ఘటనలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బిచ్కుంద CI నరేష్ వివరాలు.. మద్నూర్ వాసి అర్జున్ (64) ఇటీవల తన పొలంను విక్రయించాడు. ఈ క్రమంలో కొడుకు బైక్ కొనుగోలు కోసం తండ్రైన అర్జున్ వద్ద డబ్బులు అడిగాడు. నిరాకరించడంతో కోపంతో వెంకట్ కర్రతో అర్జున్ తలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడు. కేసు విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు ముఖ్య సూచిక చేసింది. ఆగస్ట్ 15 నుంచి వారం రోజులపాటు ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అందుకే విమాన ప్రయాణాలు చేసే వారు ఎయిర్ పోర్ట్‌కు ముందుగానే చేరుకోవాని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రకటించింది. రాఖీ పండుగ కారణంగా ప్యాసింజర్లు రద్దీ పెరుగుతుందని ఎయిర్ పోర్ట్ అంచనా వేసింది. ఈమేరకు ఫ్లైట్ సమయానికంటే ముందే బయలుదేరాలని సూచించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రుణమాఫీ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రైతుల ప్రభుత్వమని అందరికి రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానున్నాయి. టీజీపీజీఈసీ/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇంజినీరింగ్ కళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. TGPGEC/టీజీపీజీఈసెట్-2024 ప్రవేశాల రీషెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం 25న అర్హుల జాబితా ప్రకటిస్తారు. 29న వెబ్ ఆప్షన్ల సవరణ, సెప్టెంబర్ 1న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

నిజామాబాద్ న్యూగంజ్ ప్రాంతంలో ఇంట్లో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిహార్‌కు చెందిన రాణీ దేవి (35) తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి న్యూ గంజ్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త శ్రీచందన్ దాస్ ఫిర్యాదు మేరకు శుక్రవారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.