Telangana

News August 18, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔హజ్ యాత్ర కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
✔MBNR: దైవ దర్శనానికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
✔ఉమ్మడి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు
✔NGKLలో ప్రమాదం.. ఒకరి మృతి
✔కొందరికి రుణమాఫీ జరగని మాట వాస్తవమే:NGKL ఎంపీ
✔త్వరలో చేనేత ఎన్నికలు..ఓటరు జాబితాపై ఫోకస్
✔ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేదు: మాజీ మంత్రి నాగం
✔రైతన్నలకు కొత్త రుణాలు..బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్

News August 18, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో టాప్ న్యూస్

image

> MHBD: లంచం తీసుకుంటూ పట్టుబడిన ఈవో
> HNK: పరకాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి
> JN: జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
> HNK: జిల్లా కేంద్రంలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి
> BHPL: కాళేశ్వరంలో రెండు శివలింగాల కథ మీకు తెలుసా?
> MLG: కలెక్టర్, అధికారులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
> WGL: నగరంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు

News August 18, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్!

image

> MLG: గుర్తు తెలియని వాహనం ఢీకొని బాలుడి మృతి
> MHBD: నల్ల బెల్లం పట్టివేత
> MLG: నాటు సారా స్వాధీనం
> WGL: పెళ్లింట విషాదం.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి దుర్మరణం
> MLG: గుండెపోటుతో మహిళ మృతి
> MLG: ఆటో బోల్తా.. పది మందికి గాయాలు
> WGL: గుర్తు తెలియని మృతదేహం లభ్యం
> MLG: ఏడుగురిపై పిచ్చికుక్క దాడి

News August 18, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
@ వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
@ జగిత్యాల జిల్లాలో 165 డెంగ్యూ కేసులు నమోదు.
@ మెట్పల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.
@ జగిత్యాలలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం.
@ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు.

News August 18, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS

image

✓HYDలో జోరుగా గణపతుల విక్రయాలు
✓నాచారం:వెజ్ బిర్యానీలో బొద్దింక
✓HYD: అనేక చోట్ల ట్రైనీ డాక్టర్ హత్యపై నిరసనలు
✓మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కన అగ్నిప్రమాదం
✓ఉప్పల్ శిల్పారామంలో ఘనంగా జరిగిన రక్షాబంధన్
✓గోల్కొండ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
✓డ్రగ్స్ పై ఫిర్యాదుకు 8712671111 నంబర్ గుర్తుంచుకోండి:DGP
✓చందానగర్, కూకట్‌పల్లిలో స్పా సెంటర్‌లో వ్యభిచారం
✓గండిపేట, మణికొండలో ఆక్రమణల కూల్చివేత

News August 18, 2024

NZB: రేపే పండుగ.. జోరుగా సాగుతున్న రాఖీల సేల్స్

image

సోమవారం రాఖీ పండుగ సందర్భంగా మార్కెట్లలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు వ్యాపారస్థులు. ఈ సారి మహిళలు కూడా దూరప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతన్నారు. దీంతో మార్కెట్లో రాఖీల కొనుగోలు సందడి నెలకొంది. ఈ పండుగ కోసం విభిన్న డిజైన్లలో ఉన్న రాఖీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

News August 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
>తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్లి అక్క మృతి
>రెండు కార్లు ఢీ ఓ మహిళ మృతి
>ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
>ఎర్రుపాలెంలో ప్రేమ విఫలమైందని యువకుడు సూసైడ్
>సర్వాయి పాపన్న జీవితం ఆదర్శప్రాయం: డిప్యూటీ సీఎం భట్టి
>చింతూరు: పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు

News August 18, 2024

ఖమ్మం: తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళుతూ అక్క మృతి

image

తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన కూసుమంచిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన గాజులు మల్లమ్మ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆదివారం సాయంత్రం ఖమ్మం కొత్త బస్టాండ్ చేరుకొని అక్కడ రాఖీ కొనేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 18, 2024

కామారెడ్డి: గొంతు కోసుకున్న యువకుడు

image

మద్యం మత్తులో ఓ యువకుడు గొంతుకున్నాడు. ఈ ఘటనలో కామారెడ్డిలో చోటుచేసుకుంది. బీర్కూర్ చెందిన కేశవ్ (25) ఆదివారం గొంతుకోసుకుని కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. ఇది గమనించిన పోలీసులు యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ గొడవల నేపథ్యంలో గొంతు కోసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేశవ్ ఇది వరకు 3 రోజుల క్రితమే గొంతు కోసుకున్నాడు. ఇవాళ మరోసారి దాన్ని రిపీట్ చేశాడు.

News August 18, 2024

MBNR: రైతన్నలకు కొత్త రుణాలు.. బ్యాంకర్లు ప్రత్యేక ఫోకస్!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 3.38 లక్షల మంది రైతులకు రూ.2,781.56 కోట్ల రుణమాఫీ అయిందని అధికారులు వెల్లడించారు. కొత్త రుణాలకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,21,939 ఖాతాలకు రూ.8,928 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. యాసంగిలో 2,81,294 ఖాతాలకు రూ.5,950.56 కోట్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు దృష్టి పెట్టారు. ఈ ఏడాది మొత్తం 7.03 లక్షల ఖాతాదారులకు రూ.14,878 కోట్ల పంట రుణాలు అందించనున్నారు.