Telangana

News August 8, 2024

కరీంనగర్: బీఫార్మసీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ 7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలు www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పరీక్షల నియంత్రణ అధికారి పేర్కొన్నారు.

News August 8, 2024

గద్వాల: భార్యకు వీడియోకాల్‌ చేసి RMP సూసైడ్

image

భార్యకు వీడియో కాల్ చేసి RMP డాక్టర్ సూసైడ్ చేసుకున్న ఘటన గద్వాలలో బుధవారం జరిగింది. SI వెంకటేశ్ వివరాలు.. జమ్మిచేడుకు చెందిన భాస్కర్‌యాదవ్‌ RMPగా చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్నాడని నమోదైన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న భాస్కర్‌ HYDలో పిల్లల వద్ద ఉన్న భార్యకు వీడియో కాల్‌ చేసి కోర్టు కేసు, పలు సమస్యలతో బతకాలనిలేదని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు.

News August 8, 2024

మొరాయిస్తున్న బయోమెట్రిక్ హాజరు పరికరాలు !

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు పనిచేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక పరమైన సమస్యలతో బయోమెట్రిక్ హాజరును నమోదు చేయలేకపోతున్నామని బోధన, బోధనేతర సిబ్బంది పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ యంత్రాల్లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

News August 8, 2024

HYDలో గ్రామాల విలీనంపై‌ కసరత్తులు!

image

ORR లోపలున్న పట్టణాలు, నగరాలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థలో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మున్సిపల్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ORRకి అటూ ఇటూ ఉన్న పట్టణాల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం బాహ్యవలయ రహదారికి వెలుపల ఉన్న గ్రామాలను విలీనం చేయకూడదు. ఆయ గ్రామాలను ఎలా విలీనం చేయాలనే దానిపై అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

News August 8, 2024

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా నిండని చెరువులు

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది కంటే ఇప్పటివరకు వర్షాలు తక్కువగానే కురిశాయని అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువులు కుంటలు కలిపి 2,500 వరకు ఉండగా, 600 చెరువులలో 75% అంతకుమించి నీరు చేరాయి. మిగతా చెరువులు కుంటల్లో నీరు అంతగా చేరలేదు. కామారెడ్డిలో 141 చెరువుల్లో, నిజామాబాద్ జిల్లాలో 431 చెరువులు పూర్తిగా నిండి అలుగులు పడుతున్నాయి. మిగతా చెరువులో నామమాత్రంగా నీరు చేరింది.

News August 8, 2024

MDK: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

ఉమ్మడి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. న్యాల్కల్ మం.రాంతీర్థకు చెందిన సిద్ధన్న భార్య అంబిక, కుమార్తెతో కలిసి వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో భార్య స్పాట్‌లోనే చనిపోయింది. మెదక్‌కు చెందిన కానిస్టేబుల్ దుర్గపతి బైక్ అదుపుతప్పి, పాపన్నపేట(M) మహమ్మద్‌పల్లి వాసి <<13798319>>శంకర్<<>> ఆటో అదుపుతప్పి కిందపడి మృతిచెందారు. కొమురవెల్లి మం.లో శ్రీహరి కుక్కను తప్పించబోయి కిందపడి చనిపోయాడు.

News August 8, 2024

NLG: మాల మహానాడు నేతల ఢిల్లీ బాట

image

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి ఆ సంఘం రాష్ట్ర నేతలు పలువురు నల్గొండ నుంచి ఇవాళ బయలుదేరి వెళ్లారు. ఈనెల 8, 9,10 వ తేదీలలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నాయకులు పరిమి కోటేశ్వరరావు, నల్గొండ, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు, పిట్టల భాగ్యమ్మ తెలిపారు. రంగరాజు స్వర్ణలత, లలితలు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

News August 8, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి రైతులకు నిరాశ

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు తేజ మిర్చి మినహా ఇతర మిర్చి ధరలు భారీగా తగ్గాయి. తేజ మిర్చి క్వింటాకు బుధవారం రూ.17,500 పలకగా.. నేడు రూ.18 వేలకు చేరింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.15 వేల ధర రాగా.. నేడు రూ.14 వేలకు పడిపోయింది. మరో వైపు నిన్న రూ.15,500 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.14,500కి తగ్గింది.

News August 8, 2024

NZB: బస్సులో రూ. 5లక్షలు చోరీ.. ముగ్గురి అరెస్ట్

image

తూప్రాన్‌లో గత నెల 9న రాజధాని ఎక్స్‌ప్రెస్ రూ. 5 లక్షలు దోపిడీ చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై శివానందం తెలిపారు. మసాలాల వ్యాపారం చేసే నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి బస్సులో వెళ్తుండగా అతని వద్ద ఉన్న రూ. 5 లక్షలు చోరీ జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టి మహారాష్ట్రకు చెందిన సూరజ్ డికోలే, సంతోశ్ డికోలే (39), అర్జున్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.

News August 8, 2024

ఊట్కూర్: పెద్దవాగులో భారీ చేప లభ్యం

image

NRPT: ఊట్కూరు మండలంలోని కర్ణాటక సరిహద్దు సంస్తపూర్, ఇడ్లూరు పెద్దవాగుకు భారీ వర్షాలకు వరద ఉద్ధృతి వస్తోంది. దీంతో సంగం బండ జలాశయానికి నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహానికి భారీ చేపలు కొట్టుకు రావడంతో పరిసర గ్రామాల యువకులు పెద్ద ఎత్తున చేపలవేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడికి 8 కిలోల చేప చిక్కింది. ఎక్కువ మొత్తంలో పెద్ద సైజు చేపలు చిక్కుతున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.