Telangana

News August 8, 2024

HYD: JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో!

image

HYD కూకట్పల్లి JNTUH ద్వారా అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అమెరికా యూనివర్సిటీలతో ఇప్పటికే MOU ఒప్పందాలు జరిగాయి. MOUలతో ఇంటిగ్రేటెడ్ బీటెక్ MS డిగ్రీ ఐదేళ్లకే పూర్తి చేసుకోవచ్చు. మూడేళ్లు JNTU, ఒక ఏడాది బీటెక్, మరో ఏడాది ఎమ్మెస్ అమెరికాలో చదివితే సరిపోతుంది. రెగ్యులర్ B.Tech, MS చేసేందుకు ఆరేళ్లు పడుతుండగా.. దీంతో ఐదేళ్లు మాత్రమే పట్టనుంది.

News August 8, 2024

‘విద్యార్థులు, టీచర్స్ హాజరు నివేదిక అందజేయాలి’

image

పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తి అనుగుణంగా ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు అందరూ సహకరించాలని, ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారి హాజరు మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ తెలియజేశారు. బుధవారం కలెక్టరేట్లో మండల విద్యాధికారులు, కోఆర్డినేటర్లు, మండల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రెండో దశ ఏకరూప దుస్తులు విద్యార్థులకు వారం రోజులలో అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

News August 8, 2024

అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వే చేపట్టాలి: జిల్లా కలెక్టర్

image

స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రెండు రోజులు జిల్లా అధికారులందరూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని కలెక్టర్ అన్నారు. రెండు రోజులు కూడా పూర్తి శ్రద్ధతో కార్యక్రమాల్లో పాల్గొనాలని, ఇవాళ జిల్లాలోని అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో ఫీవర్ సర్వే చేపట్టాలని పేర్కొన్నారు.

News August 8, 2024

తెలంగాణ ఫుడ్ కమిషన్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

తెలంగాణ ఫుడ్ కమిషన్ వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పర్యటన చివరి రోజు జిల్లాలోని పలు అంగన్వాడీ కేంద్రాలను, వసతి గృహాలను, రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీ అనంతరం బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సత్య శారద దేవితో కలిసి సమావేశం నిర్వహించారు.

News August 8, 2024

ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండకూడదు: డిప్యూటీ సీఎం భట్టి

image

ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో 400 కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పర్యటనలో మాట్లాడుతూ.. గుండెల నిండా ప్రేమను పంచేటువంటి ప్రజలున్న ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉండటానికి వీలులేదని అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాను మా గుండెల్లో పెట్టి చూసుకుంటామని తెలిపారు.

News August 8, 2024

HYD: HMWSSB ఎండీగా అశోక్ రెడ్డి

image

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సేవరేజ్ అండ్ వాటర్ బోర్డు (HMWSSB) సప్లై మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతల స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వాటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.

News August 8, 2024

నాగిరెడ్డిపేట: అనుమతి లేకుండానే పోచారం ప్రాజెక్టు కట్ట తొలగింపు

image

నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్ట్ కట్టను నేషనల్ హైవే అధికారులు నీటిపారుదల శాఖ అనుమతి లేకుండానే తొలగించారని డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. నేషనల్ హైవే అలైన్‌మెంట్‌ లేని భూమి వద్ద ఉన్న 100 ఏళ్ల చెట్టును సైతం నరికి వేశారని ఆయన అన్నారు. అనుమతి లేకుండా ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అని ఆయన నేషనల్ హైవే అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు కట్టను తొలగించడం ద్వారా నీటి నిల్వకు తీవ్ర నష్టం అన్నారు.

News August 8, 2024

HYD: HMWSSB ఎండీగా అశోక్ రెడ్డి

image

హైదరాబాద్ మెట్రోపాలిటన్ సేవరేజ్ అండ్ వాటర్ బోర్డు (HMWSSB) సప్లై మేనేజింగ్ డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతల స్వీకరించిన సందర్భంగా పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. వాటర్ బోర్డు పరిధిలో ఉన్న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.

News August 7, 2024

నిజామాబాద్: మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి జైలు శిక్ష

image

మద్యం తాగి వాహనం నడిపిన ముగ్గురికి 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ వి.వెంకట నారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో 37 మంది పట్టుబడగా వారికి బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ 34 మందికి రూ.89 వేలు జరిమానా విధించారన్నారు. ముగ్గురికి జైలు శిక్ష విధించారని చెప్పారు.

News August 7, 2024

పిప్పిరి గ్రామానికి వరాలు కురిపించిన డిప్యూటీ సీఎం

image

పాదయాత్ర ప్రారంభానికి తొలి అడుగు నేలైన బజారత్నుర్ పిప్పిరి గ్రామాన్ని దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన పర్యటనలో వరాల జల్లులు కురిపించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 45 కోట్లు, పిప్పిరిలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించారు. బుగ్గారం, తేజ్పూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.