India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ADB మండలంలోని మూడు భవిత కేంద్రాల్లో ఆయా పోస్టులను తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ MEO సోమయ్య పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. నెలకు గౌరవ వేతనం రూ.3,250 ఉంటుందని, ఆదిలాబాద్ డైట్ కళాశాల, మావల, అంకోలిలోని కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఆసక్తిగలవారు కార్యాలయంలో 9లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,82,284 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.89,660, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,810, అన్నదానం రూ.16,813 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌కు రైల్వే అధికారులు ఆమోదించారు. గత కొన్నాళ్లుగా నెక్కొండలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతోంది. ఇందులో ఇంటర్సిటీ రైలు హాల్టింగ్ డిమాండ్ ఉంది. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రాను, పోను హాల్టింగ్ ఇచ్చారు.

కరీంనగర్ జిల్లాలో బోడ కాకరకాయలకు భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తింటారు. దీంతో మార్కెట్లో దీని రేటు విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో ప్రస్తుతం కిలో బొడ కాకరకాయ ధర రూ.240 వరకు పలుకుతోంది. ప్రతి సంవత్సరం అషాఢ, శ్రావణ మాసాల్లో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి.

కోటగిరిలో బాలాజీ ట్రేడర్స్ రైస్ మిల్లుపై బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేషన్ బియ్యంతో వెళ్తున్న 2 లారీలను గుర్తించి, 270క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిల్లు యజమానితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ నిఖిల్ రాజ్ తెలిపారు. నెల రోజుల క్రితం ఈ రైస్ మిల్లుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 80 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15న దీన్ని ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అనంతరం వైరాలో జరిగే బహిరంగ సభలో రైతు రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. ఆగస్టు 15 తేదీని రైతు దినోత్సవంగా జరుపుకోబోతున్నామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు గోదావరి జలాలని తరలించి ఆయా ప్రాజెక్టులని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.5,560 కోట్లు కేటాయించి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి వైరాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బుధవారం 14వ వార్డు నందు డాంబర్ వెంచర్ స్థలాన్ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొదుల హరినాథ్, కట్ల సంతోష్, పమ్మీ అశోక్, పల్లపు కొండలు, ఆత్మ కమిటీ ఛైర్మన్ కోసూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.

భద్రాచలం పట్టణంలోని చర్ల రోడ్డులో సతీష్(42) అనే వ్యక్తి డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. మున్సిపాలిటీ సిబ్బంది, అధికారులు డ్రైనేజీ కాలువలో గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతైన మృతదేహాన్ని వెలికి తీశారు. వెలికితీసిన మృతదేహాన్ని అధికారులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.