India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తాను BRSను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తొర్రూర్‌లో ఆయన మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతానని కావాలనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలను కార్యకర్తలు నమ్మకూడదని, కార్యకర్తలు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయిపేటలో ప్రబలిన విషజ్వరాలు. గుండాయిపేటలో విషజ్వరాలతో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలు ప్రబలిన అధికారులు పట్టించుకోవట్లేదని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వరంగల్‌లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య చేసిన ప్రయత్నం ఫలించింది. వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కింద వెల్నెస్ సెంటర్ మంజూరు అయింది. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగులకు లాభం చేకూరుతుందని ఎంపీ కడియం కావ్య చెప్పుకొచ్చారు. ఎంపీకి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విభజన హామీల్లో భాగంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ట్వీట్ చేశారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని గతంలో ఉద్యమం జరిగిందని, పదేళ్లుగా బీజేపి కేంద్రంలో అధికారంలో ఉందని, తెలంగాణలో భారీ పరిశ్రమలకు మోదీ పది పైసలైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

ఓ యువకుడుపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లింగం (28) అదే గ్రామానికి చెందిన జగతయ్య సుద్దపల్లి గ్రామానికి చెందిన బాలరాజు ఇద్దరు కలిసి లింగంపై దాడి చేసినట్లు సీఐ తెలిపారు. అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు లింగంను గమనించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండలో పెళ్లికి వచ్చిన యువకుడు సాగర్ కాలవలో గల్లంతు అయిన ఘటన ఆదివారం జరిగింది. స్నానం కోసం సాగర్ కాలువ దిగి ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతు అయ్యాడు. యువకుడు హుజూర్నగర్‌కు చెందిన వెంకట్‌గా(20) స్థానికులు గుర్తించారు. యువకుడి కోసం గరిడేపల్లి పోలీసులు గాలిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతపల్లి లో 30.0 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లిలో 20.3 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 16.5 మిల్లీమీటర్లు, చిన్నజట్రంలో 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్‌గా నర్సాపూర్ మండలానికి చెందిన శత్రు నాయక్ నియమితులయ్యారు. ఇది వరకు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో పలు హోదాలో పనిచేశారు. మొన్నటి వరకు ముంబైలోని ఎఫ్సిఐ డీజీఎంగా పనిచేసిన ఆయన పదోన్నతిపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి బదిలీపై వెళ్లారు. పదోన్నతి పై వెళ్లడంతో ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

రోడ్డు ప్రమాదంలో శనివారం <<13825176>>ఇద్దరు మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. బంధువుల ప్రకారం.. వేలేరు మం. మల్లికుదుర్లకు చెందిన మల్లారెడ్డి(52), అమరేందర్ రెడ్డి(42) మేనబావ, బామ్మర్దులు. వీరి వయసులో వ్యత్యాసం ఉన్నా స్నేహితుల్లాగే ఉండేవారు. ఈ క్రమంలోనే బైకుపై వెళ్తుండగా నిన్న సా. జానకీపురం మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి 20 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
Sorry, no posts matched your criteria.