Telangana

News July 31, 2024

ఆగస్టు 2న సాగర్‌ ఎడమ కాల్వకు నీరు విడుదల

image

ఎగువ నుంచి వరద ఉద్ధృతి ప్రాజెక్టులోకి వస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టుకు 1.79 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. నీటిమట్టం 518 అడుగులు, 145 టీఎంసీలుగా ఉంది. భారీ ఇన్‌ఫ్లోతో రోజూ 20 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి చేరనుంది. ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో నేపథ్యంలో ఆగస్టు 2న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయనున్నారు.

News July 31, 2024

అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే పరిస్థితులు: ఎమ్మెల్యే KVR

image

అసెంబ్లీలో ర్యాగింగ్ చేసే విధంగా పరిస్థితులు ఉన్నాయని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి అభిప్రాయపడ్డారు. శాసనసభలో పద్దులపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న ఆయన పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పాడి ప్రొక్యూర్ మెంట్ సరైన పద్ధతిలో జరగడం లేదని ఆక్షేపించారు. ధరణి వల్ల భూములు అటు ఇటుగా మారి ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.

News July 31, 2024

ఆదిలాబాద్: రుణమాఫీ కాలేదా..? అయితే కాల్ చేయండి

image

రైతులకు మేలుచేసే విధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమానికి జిల్లాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా నోడల్ అధికారి రమేశ్ 7288894003 సంప్రదించాలని సూచించారు.
>>SHARE IT

News July 31, 2024

WOW.. తెలంగాణ టీం కెప్టెన్‌గా సిద్దిపేట బిడ్డ

image

అండర్-17 జూనియర్ నేషనల్ ఫుట్‌బాల్ తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చిన్నకోడూరు జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థిని వడ్లకొండ చైతన్య శ్రీ ఎంపికైనట్లు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో జరిగే పోటీల్లో తెలంగాణ టీంకు కెప్టెన్‌గా చైతన్యశ్రీ ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపల్ భూపాల్ రాజు, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

News July 31, 2024

నిర్మల్: LRS దరఖాస్తులకు మోక్షం..!

image

LRS దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియలో కదలిక రానుంది. నిర్మల్ జిల్లాలోని మూడు పట్టణాల్లో 26,182 దరఖాస్తులకు మోక్షం కలగడంతోపాటు దాదాపు రూ.50 కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఏర్పడింది.

News July 31, 2024

RR: వ్యవసాయ పనుల్లో రైతన్నలు బిజీ.. బిజీ!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నాట్లు వేస్తున్నారు. రైతన్నలు వ్యవసాయ పొలంలో బిజీ.. బిజీగా గడుపుతున్నారు. దుక్కులు సిద్ధం చేయడంతో పాటు కంది, జొన్న పంటలకు రైతులు కలుపుతీత, ఎరువులు వేస్తున్నారు. విత్తనాల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు.

News July 31, 2024

సిద్దిపేట: ‘ఆరోగ్య సిబ్బంది ఫీవర్ సర్వే నిర్వహించాలి’

image

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యమని సిద్దిపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేటలో ఆయన అధ్యక్షతన జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులకు, RBSK వైద్య అధికారులకు, MLHPలకు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. వ్యాధుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు.

News July 31, 2024

NZB: ఆర్టీసీ రీజియన్లో ప్రమాద రహిత వారోత్సవాల ముగింపు

image

ఆర్టీసీలో ప్రమాద రహిత వారోత్సవాలు ముగిసాయి. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆర్టీసీ నిజామాబాద్ 2వ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రీజియన్, డిపోల వారీగా డ్రైవర్లకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఆర్టీసీ నిజామాబాద్ రీజనల్ మేనేజర్ జానీ రెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్లు సరస్వతీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News July 31, 2024

ఆదిలాబాద్ : DEECET అభ్యర్థులకు గమనిక

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో DEECETలో ర్యాంక్ సాధించిన అభ్యర్ధులకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. D.EDలో ప్రవేశానికి AUG 1 నుండి AUG 6వరకు సర్టిఫికెట్ వెరీఫికేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్స్ అభ్యర్థులకు కేటాయించిన తేదీలలో ఆదిలాబాద్ డైట్ కళాశాలలో హాజరై సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు

News July 31, 2024

మహిళల బలోపేతం కోసమే మహిళా శక్తి : కలెక్టర్

image

ఖమ్మం: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం నగరంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు.