Telangana

News August 2, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

> BHPL: గోపాలపురం గ్రామంలో వ్యక్తి మృతి
> WGL: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరికి తీవ్ర గాయాలు
> JN: స్కూల్ బస్ కింద పడి విద్యార్థి మృతి
> WGL: అన్న గొంతు కోసిన తమ్ముడు
> JN: గుండెపోటుతో పురోహితుడు మృతి
> MHBD: విద్యుత్ షాక్ తో మహిళా మృతి
> BHPL: గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
> MLG: విద్యార్థులకు అస్వస్థత.

News August 2, 2024

పాలమూరులో నేటి ముఖ్యాంశాలు

image

✔CM రేవంత్ రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే
✔MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
✔GDWL, NRPTలో కొత్త వైద్య కళాశాలలు
✔జూరాల 41 గేట్లు ఎత్తి నీటి విడుదల
✔ఈనెల 6 వరకు డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్
✔CM సభకు వెళ్లిన ఉమ్మడి జిల్లా టీచర్లు
✔కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన: మర్రి జనార్దన్ రెడ్డి
✔WNPT:దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్
✔నేటి నుంచి ITIలో దరఖాస్తుల ఆహ్వానం

News August 2, 2024

సంగారెడ్డి: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

జిల్లాలో ఈనెల 5 నుంచి నిర్వహించే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వల్ల క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News August 2, 2024

KMR: జాబ్ పేరుతో మోసం.. వ్యక్తి అరెస్టు

image

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కామారెడ్డికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 15 మంది నుంచి రూ.8.50 లక్షలు వసూలు చేశాడని ఆయన తెలిపారు. కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు కల్పించకపోగా.. ఫేక్ జాబ్ లెటర్లు అందజేసి పత్తాలేకుండా పోయాడన్నారు. బాధితుల ఫిర్యాదుతో ప్రవీణ్‌ను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు.

News August 2, 2024

సైబర్ క్రైం.. MBNR కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్.. కేసు నమోదు

image

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఏకంగా మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర పేరు, ఆమె ఫొటోతో ఫేక్ అకౌంట్ సృష్టించి సోషల్ మీడియాలోకి వదిలారు సైబర్ నేరగాళ్ళు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. +94784605962 నంబర్‌తో ఓ నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించారని ఆమె తెలిపారు.

News August 2, 2024

జనగామ: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

image

స్కూల్ బస్సు కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. జనగామ మండలం అడవి కేశవాపూర్‌కు చెందిన విద్యార్థి బానోతు వరుణ్ స్కూల్ బస్సుకు బ్యాగ్ తట్టుకొని వెనుక టైర్ కింద పడిపోయాడు. దీంతో బస్సు టైరు విద్యార్థి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థి బంధువులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.

News August 2, 2024

ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి: సీఎండీ

image

TGNPDCL హనుమకొండ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఈలు, డీఈలు, నోడల్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. అంతరాయాలు, బ్రేక్ డౌన్స్, ట్రిప్పింగ్స్ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News August 2, 2024

MBNR: ఈనెల 6 వరకు డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

DEECET-2024లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 2024-2026 విద్యా సంవత్సరానికి మొదటి సంవత్సరం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అడ్మిషన్ కొరకు ధ్రువ పత్రాలను ఆగస్టు 6 వరకు పరిశీలిస్తామని DIET ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ మేరజులఖాన్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెంది ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు వారికి కేటాయించిన తేదీల్లో ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

News August 2, 2024

ASF: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు విజయవంతం చేయాలి: కలెక్టర్

image

తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం పోస్టర్‌ను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా శిశు వైద్యశాఖ అధికారులతో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News August 2, 2024

NZB: మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషిచేయాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు.