Telangana

News August 29, 2024

ఏం చేస్తున్నావ్ రేవంత్‌ రెడ్డి: హరీశ్‌ రావు

image

CM రేవంత్‌రెడ్డి గురుకులాల్లో మౌలిక వసతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు అన్నారు. ‘ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలి. మీ పాలన ఎలా ఉందొ చెప్పడానికి గురుకులాలే నిదర్శనం. KCR హయాంలో వెలుగొందిన గురుకులాలు మీ నిర్లక్ష్యం వల్ల మసకబారుతున్నాయి’అని X వేదికగా ఫైర్‌ అయ్యారు. విద్యార్థులు ఎలుకలు కరిచి దవాఖానల పాలవుతుంటే ఏం చేస్తున్నావంటూ ప్రశ్నించారు.

News August 29, 2024

నల్గొండ: భర్తను హత్య చేసిన భార్య

image

నల్గొండలోని ఏఆర్ నగర్‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. భర్త వెంకన్నను భార్య మైసమ్మ హత్య చేసినట్లు సమాచారం. హత్యకు అక్రమ సంబంధం కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 29, 2024

పెద్దపల్లి: బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమ అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత మహిళా, శిశు, దివ్యాంగ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ సీసీఐలలో 6వ తరగతి చదువుతున్న పిల్లలందరినీ ఎంపిక చేసి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పించాలని ఆదేశించారు.

News August 29, 2024

వరంగల్: మక్కలు క్వింటా రూ.2,936 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో మళ్లీ రికార్డు నమోదైంది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈరోజు మక్కలకు రికార్డు ధర వచ్చింది. నేడు క్వింటా మక్కలకు రూ.2,936 ధర వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. కాగా మంగళవారం రూ.2,885 పలికిన క్వింటా మక్కలకు బుధవారం రూ.2,911 ధర వచ్చింది. 

News August 29, 2024

HYD: అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు

image

చెరువు గర్భంలో, ఎఫ్టీఎల్ , బఫర్ జోన్లలో భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం క్షమించరాని నేరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సచివాలయంలో మాట్లాడారు. అక్రమ నిర్మాణాలకు తోడ్పాటు అందించిన అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను గుర్తించే ప్రక్రియను హైడ్రా మొదలు పెట్టిందని వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేటు నిర్ణయించి మరీ వసూళ్లు చేశారనే ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు ఉంటాయన్నారు.

News August 29, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల్లో 30.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 23.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్లో 18.3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో 6.8 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా బీచుపల్లిలో 6.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 29, 2024

HYD: దుర్గం చెరువులోని 204 భవనాలకు ‘హైడ్రా’ నోటీసులు

image

‘హైడ్రా’ కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ఇటీవల జీహెచ్‌ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో ఆందోళన చెందుతున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్‌ఎస్‌ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉండటం గమనార్హం. హైటెక్‌సిటీలోని దుర్గం చెరువు చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు ఉన్నాయి.

News August 29, 2024

నెల రోజులుగా గాంధీ చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీ

image

గాంధీ ఆస్పత్రిలో గత నెల రోజులకు పైగా చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు రోజూ ఫుడ్ అందించే డైట్ క్యాంటీన్‌లో చీఫ్ డైటీషియన్ పోస్ట్ ఖాళీ అవ్వడంతో పర్యవేక్షణలో లోపాలు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి డైటిక్స్‌లో డైటీషియన్, చీఫ్ డైటీషియన్ 2 పోస్టులు ఉండాల్సి ఉంది. కానీ, చాలా కాలంగా డైటీషియన్ పోస్ట్ ఖాళీ ఉండగా గత నెల చీఫ్ డైటీషియన్ బదిలీపై వెళ్లిపోయారు.

News August 29, 2024

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

image

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ముఖ్య నాయకులు గురువారం తన స్వాగతం పలికారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామ సమీపంలో ఉన్న కన్హా శాంతి వనం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆయన హాజరయ్యారు. తిమ్మాపూర్ వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.

News August 29, 2024

మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

image

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.