Telangana

News July 30, 2024

ఉమ్మడి కరీంనగర్‌లో బదిలీలు

image

ఉమ్మడి KNR వ్యాప్తంగా దేవాదాయ శాఖలో బదిలీల ఉత్కంఠ నెలకొంది. జిల్లాలోని అర్చకులతో పాటు.. జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు, పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. కొందరికి పదవీ విరమణ వయసు దగ్గర పడటంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి KNR అర్చక, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. దేవాలయాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రభుత్వం బదిలీలకు శ్రీకారం చుట్టిందన్నారు.

News July 30, 2024

కన్నుల పండుగ భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News July 30, 2024

MBNR:శుభకార్యాలకు అద్దె బస్సులు.. సంప్రదించండి!

image

వచ్చే నెల 5వ తేదీ నుంచి శ్రావణమాసం ఆరంభమవుతున్నందున పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. MBNR-94411 62588, GDWL-99592 26290, NGKL-83092 14790, SDNR-91826 45281, అచ్చంపేట-99592 26291, కల్వకుర్తి-99123 76847, కొల్లాపూర్-90004 05878, నారాయణపేట-99592 26293, వనపర్తి-99592 26289 చరవాణి నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

News July 30, 2024

BREAKING: HYD: వనస్థలిపురంలో గ్యాంగ్ రేప్

image

HYD వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే హోటల్‌లో యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 30, 2024

BREAKING: HYD: వనస్థలిపురంలో గ్యాంగ్ రేప్

image

HYD వనస్థలిపురంలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉండే హోటల్‌లో యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన యువతిపై మద్యం మత్తులో అత్యాచారం చేశారు. స్నేహితుడితో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News July 30, 2024

త్వరలోనే ఇంటి నుంచి ఇంటికి కార్గో సేవలు: ATM/KMM

image

కార్గో సేవలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు TGSRTC ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటి నుంచి ఇంటికి లాజిస్టిక్ విభాగాన్ని అభివృద్ధి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆదేశించారు. ఈ తరహా విధానాన్ని తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లో కార్గో సేవలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ATM(కార్గో) పవన్ తెలిపారు.

News July 30, 2024

భువనగిరి: బోడ కాకరకాయ ధర రూ.400

image

బోడ కాకరకాయ మార్కెట్‌లో భలే గిరాకి ఉంది. సంవత్సరంలో కేవలం నెలన్నర మాత్రమే లభించే బోడ కాకరకాయల కోసం ప్రజలు ఎదురు చూస్తారు. సీజన్‌లో కనీసం ఒక్కసారైనా తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భువనగిరి కూరగాయల మార్కెట్‌లో కిలో బోడ కాకరకాయ ధర రూ.400 వరకు పలుకుతోంది. రసాయనాలు లేకుండా పండే బోడ కాకరకాయ ధర కోడి మాంసం కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.

News July 30, 2024

KNR: మూడేళ్లలో 341 కేసులు

image

ఉమ్మడి KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 18 ఏళ్లలోపు విద్యార్థులు బైకులు, కార్లు నడపుతుండటంతోనే ప్రమాదాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు 70కి పైగా మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. 2022లో 32, 2023లో 231, 2024లో 78.. గత మూడేళ్లలో మొత్తం 341 కేసులు నమోదయ్యాయని, మైనర్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని KNR టౌన్ ACP జి.నరేందర్ తెలిపారు.

News July 30, 2024

రాష్ట్రంలో 5, 6 స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి

image

పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌లను గుర్తించి వాటిని బాధితులకు అందించడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో వరుసగా 5, 6 స్థానాల్లో నిలిచాయి. 20 ఏప్రిల్ 2023 నుంచి 14 జులై 2024 వరకు NZB కమిషనరేట్‌లో 6,690 సెల్ ఫోన్లు పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,941 గుర్తించి 1,888 ఫోన్‌లను బాధితులకు అందించారు. కామారెడ్డి జిల్లాలో 4,917 కేసులు నమోదు కాగా 2,756 సెల్ ఫోన్లు గుర్తించారు.

News July 30, 2024

మూసీకి జలకళ.. 642.5 అడుగులకు పెరిగిన నీటిమట్టం

image

నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాలైన రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువ కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచే మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి వరకు 642.5 అడుగులకు పెరిగింది.