India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మూడేళ్ల పాటు ప్రేమించుకున్నాక పెళ్లికి నిరాకరించిన యువకుడి ఇంటి ఎదుట యువతి మంగళవారం ధర్నాకు దిగింది. నేలకొండపల్లి మండలంలోని గువ్వలగూడెం గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి రాము మూడేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. అయితే కొద్ది రోజులుగా పెళ్లి చేసుకోవడానికి రాము నిరాకరిస్తున్నాడు. దీంతో అతని ఇంటి ఎదుట బైఠాయించి తనకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టింది. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి కర్ణాకటకు వెళ్తున్న తుఫాన్ వాహనం బిజినేపల్లిలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్నవారిలో ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జాతీయ స్థాయి కబడ్డీ డాకారిణి ముడేటి ప్రియాంక అగ్నివీరుకు ఎంపికైనట్లు కోచ్ ప్రశాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలం అన్సాన్పల్లికి చెందిన మల్లయ్య-సావిత్రి దంపతుల చిన్న కూతురు ముడేటి ప్రియాంక.. 2023 మేలో కరీంనగర్లో జరిగిన అగ్నివీర్ ఎంపిక పరీక్షలో సత్తా చాటింది. ఫిబ్రవరిలో వెలువడిన ఫలితాల్లో శిక్షణకు ఎంపికైంది. ఏప్రిల్‌లో శిక్షణ నిమిత్తం బెంగళూరు వెళ్లనుంది.
KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సిరికొండ మండల్ హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వినోద్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాదులోని నాచారంలో నిర్వహించిన రాష్ట్ర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్ ను అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు క్రీడా ప్రతినిధులు అభినందనలు తెలిపినారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో రాగల 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రెండ్రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్కూక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాల రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందవద్దని, సీఎం దృష్టికి మీ సమస్య తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
5రోజుల సుదీర్ఘ విరానంతరంమం అ వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం పున:ప్రారంభం కానుంది. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం అమావాస్య, నేడు ఉగాది నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పలు బస్తీలలో పర్యటిచారు. దశాబ్దాల క్రితమే ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు పొట్టకూటి కోసం పట్టణానికి చేరుకుని సంవత్సరాల గడుస్తున్న కనీసం పక్కా ఇల్లు ప్రభుత్వాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన సందర్భంలో పాలమూరు బిడ్డలకు ఇల్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ గాలికి వదిలేసారని అన్నారు.
మంగళవారం ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం కనిపించింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు మేఘావృతమై చల్లటి వాతావరణం కనిపించగా 8 గంటల తర్వాత సూర్యుని ప్రతాపం కనిపించింది. సాయంత్రం 4 గంటల వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం 4 గంటల తర్వాతా ఉష్ణోగ్రతలో తగ్గుదల ఏర్పడి చల్లటి గాలులు వీచాయి రాత్రి 8 గంటల తర్వాతా ఉరుములతో కూడిన వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.