India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ఈనెల 11, 12న రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాహుల్ మంగళవారం తెలిపారు. ఈనెల 11న గురువారం రంజాన్, 12న శుక్రవారం సెలవు ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 13న మార్కెట్ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. PIC CRD: Anjum Alam
రంజాన్ సమీపిస్తున్న వేళ ఓల్డ్ సిటీ కళకళలాడుతోంది. చార్మినార్, మదీనా, లాడ్‌బజార్‌కు సాయంత్రం నుంచే వేలాదిగా జనం తరలివస్తున్నారు. పండగకు మరో రెండ్రోజులే సమయం ఉండడంతో పాషింగ్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి వరకు ఇక్కడ దుకాణాలు తెరిచి ఉండడంతో చార్మినార్ పరిసరాలు సందడిగా మారాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
PIC CRD: Anjum Alam
*ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా ఉగాది పర్వదిన వేడుకలు.
*KNR: అగ్గిపెట్టెలో పట్టే పట్టు వస్త్రం బహూకరణ (VIDEO)
*భక్తులతో కిటకిటలాడిన ఓదెల మల్లన్న ఆలయం.
*భీమదేవరపల్లి మండలంలో ఆరుగురు పేకాటరాయుళ్ల పట్టివేత.
*పుష్ప2 సినిమా సాంగ్‌లో పాల్గొన్న మల్యాల మండల యువకులు.
*కాటారం మండలంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం.
*ధర్మారం మండలంలో వృద్ధుడిపై ఫోక్సో కేసు నమోదు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట ప్రాంతం అభివృద్ధికి డీకే అరుణ నిధులు తీసుకొచ్చినట్లు నిరూపిస్తే పోటీలో నుండి తప్పుకుంటానని అన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 15న నారాయణపేటలో నిర్వహించే జన జాతర సభలో సీఎం రేవంత్ పాల్గొంటారని చెప్పారు.
♥ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు
♥ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
♥ఉగాది పంచాంగ శ్రవణ వేడుకలో పాల్గొన్న స్థానిక MLAలు,కలెక్టర్లు,ప్రజాప్రతినిధులు
♥నూతన ఓటు హక్కును నమోదు చేసుకోండి:EC
♥అచ్చంపేట యువతితో ప్రేమ.. పెళ్లి చేసుకోనని గొంతు కోసుకున్న యువకుడు
♥ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు
♥ప్రచారంలో దూసుకుపోతున్న ఎంపీ అభ్యర్థులు
సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల మహోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మహోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక బోనం చెల్లించి మొక్కులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు సన్మానం చేశారు.
అమెరికాలో కిడ్నాప్‌కు గురైన నాచారం వాసి మహమ్మద్ అబ్దుల్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. క్లేవ్ ల్యాండ్ పట్టణంలో ఒక సరస్సులో అబ్దుల్ మృతదేహం లభ్యమైందని, అతడి నడుముకి పాస్ పోర్ట్, ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయని తెలిపారు. పోలీసులు పరిశీలించి అబ్దుల్ మృతదేహంగా గుర్తించారని వెల్లడించారు. అబ్దుల్ మృతదేహాన్ని HYDకి తీసుకొస్తారా లేదా అక్కడే ఖననం చేసే విషయాన్ని త్వరలో తెలుపుతామన్నారు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిజినేపల్లి మండలం వసురాం తాండలో రాముడు నాయక్ అనే రైతు తాండ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలంలో లేగ దూడపై చిరుత పులి దాడి చేసి చంపినట్లు మంగళవారం తెలిపారు. ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే గిరిజనులు జంకుతున్నారు. ఫారెస్టు అధికారులు పంచనామా చేసి చిరుతపులి అవు దూడను చంపి తినేసినట్లు గుర్తించారు. అత్యవసరం అయితే తప్ప చుట్టుపక్కల గ్రామాల తాండా వాసులు బయటికి రావొద్దని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.