India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI లక్ష్మినాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. SI, తోటి సిబ్బందితో లక్ష్మినాయణ దురుసుగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.

హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి సారంగపాణి తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 3న అండర్ 14, 16, 18, 20 బాల బాలికలు, మహిళ, పురుషులకు జావెలిన్ త్రో, 100 మీటర్ల పరుగు ఉంటుందన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జిల్లా అథ్లెట్లు శనివారం ఉదయం 10 గంటలకు JNS స్టేడియంలో హాజరు కావాలని కోరారు.

వర్షాకాలం నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. వారం రోజుల ముసురు వానతో వాతావరణ మార్పులు జరిగి జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని వివిధ గ్రామాలలో రోగులు ఎక్కువ అవుతున్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి కొన్ని రోజులుగా రోగుల తాకిడి పెరిగింది. నిత్యం 300లకు పైగా ఓపీ నమోదవుతోంది.

నాగార్జునసాగర్ జలాశయానికి 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 182.65 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

వరంగల్ మహానగర పాలకసంస్థ పాలకవర్గంలో అధికార కాంగ్రెస్ బలం పెరిగింది. గురువారం తూర్పు నియోజకవర్గానికి చెందిన BRS కార్పొరేటర్లు పల్లం పద్మ, సోమిశెట్టి ప్రవీణ్, జోగి సువర్ణ హస్తం గూటికి చేరారు. దీంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య 7 నుంచి 39కి పెరిగింది. BRS బలం 39 నుంచి 17కు తగ్గింది. BJP 10 నుంచి 11కు పెరిగింది. కాగా, తూర్పులో BRS కార్పొరేటర్ల చేరికలపై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లోగా యావరేజ్ గా 5,166 క్యూసెక్కుల అది పెరుగుతూ రాత్రి 9 గంటలకు 40,786 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో పెరిగింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 37.891 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరులో నీటి నిల్వ 10.55 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎల్లంపల్లి జలాలు 14,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 309.45 మీటర్లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలకుగాను 10:15 టీఎంసీలమేరకు నీరు ఉందని అధికారులు తెలిపారు.

ఇన్నాళ్లు నీరు లేక వేలవేల బోయిన చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుంటున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపు పెద్ద చెరువులు 33 ఉండగా.. చిన్న చెరువులు, కుంటలు 40 వరకు ఉంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంటుంది. ఇన్నాళ్లు వెలవెలబోయిన చెరువులు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రఘునాథఫాలెం మండలంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్వామి నారాయణ ట్రస్టు ఆధ్వర్యంలో గురుకుల విద్యాలయాన్ని నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలో 13.07 ఎకరాల విస్తీర్ణంలో కేజీ నుంచి 12వ తరగతి వరకు గురుకుల విద్యాలయం నెలకొల్పడానికి మార్కెట్ ధరకు భూమిని కేటాయించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టెండర్లను పూర్తి చేసి త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు.

2025-26 విద్యాసంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. సెప్టెంబర్ 16లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్ సైట్ చూడాలన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.