Telangana

News July 29, 2024

వరంగల్: కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి సూసైడ్

image

కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి బెంగతో ఆత్మహత్యకు పాల్పడింది. మిల్స్‌కాలని సీఐ మల్లయ్య తెలిపిన వివరాలు.. వరంగల్ జిల్లా కేంద్రంలోని చింతల్‌కు చెందిన గీతారాణి(38) కుమారుడు డిప్లొమాలో ఫెయిల్ అయి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆమె మనోవేదనకు గురై ఆదివారం ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఆమె తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ చెప్పారు.

News July 29, 2024

NZB: ఓ వ్యక్తికి అపరిచిత వ్యక్తి కాల్ బెదిరించి

image

మోపాల్ మండలం సింగంపల్లికి చెందిన భూమేశ్‌కు ఆదివారం ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశారు. కోడలు గౌతమి తమ ఆధీనంలో ఉందని, ఆమె ఏడుస్తున్న వీడియోలు చూపించాడు. హిందీలో మాట్లాడుతూ.. భూమేశ్ వివరాలను సేకరించాడు. అనుమానం వచ్చిన భూమేశ్ తన కోడలికి ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మళ్లీ అపరిచిత వ్యక్తి భూమేశ్‌‌కు ఫోన్ చేసి గౌతమి అందరినీ కొడుతుందని ఓ వీడియో పంపాడు. దీంతో ఆయన పోలీసులను సంప్రదించాడు.

News July 29, 2024

HYD: బాలిక బ్రెయిన్ డెడ్.. పది మందికి ప్రాణదానం

image

బ్రెయిన్‌డెడ్ అయిన బాలిక అవయవాలతో మరో పది మందికి ప్రాణం పోశారు. మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. తల్లిదండ్రులు బాలిక అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. 25న బాలిక మృతి చెందటంతో అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు

News July 29, 2024

రంగారెడ్డి: ఈ-ఆఫీస్‌ సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

image

RR కలెక్టరేట్‌లో త్వరలోనే ఈ-ఆఫీస్‌ కార్యకలాపాలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు కాగితాలపై కొనసాగుతున్న సేవలు.. ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా సాగనున్నాయి. పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న కలెక్టర్‌ శశాంక వీలైనంత త్వరగా ఈ-ఆఫీస్‌ సేవలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అంతేకాకుండా అధికారులు, సిబ్బందికి సాంకేతిక నైపుణ్యంపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు.

News July 29, 2024

HYD: బాలిక బ్రెయిన్ డెడ్.. పది మందికి ప్రాణదానం

image

బ్రెయిన్‌డెడ్ అయిన బాలిక అవయవాలతో మరో పది మందికి ప్రాణం పోశారు. మేడ్చల్‌కు చెందిన శ్రీనివాస్, సరిత దంపతుల రెండో కూతురు దీపిక(16) ఈనెల 22న ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరిక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. తల్లిదండ్రులు బాలిక అవయవాలు దానం చేయాలని నిర్ణయించారు. 25న బాలిక మృతి చెందటంతో అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు.

News July 29, 2024

కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత

image

కడెం ప్రాజెక్టులోని రెండు గేట్లను ఎత్తి సుమారు 8,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం 695 అడుగులకు నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 699 క్యూసెక్కుల నీరు వస్తోంది. కాలువలకు 379, మిషన్ భగీరథ 9, దిగువకు 8178 మొత్తం కలిపి 8634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.

News July 29, 2024

మెదక్: గుండెపోటుతో రికార్డ్ అసిస్టెంట్ మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రెవెన్యూ కార్యాలయ రికార్డు అసిస్టెంట్ చెంది సురేశ్ (28) గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మృతి చెందారు. వీఆర్ఏగా పనిచేస్తున్న సురేశ్ ఏడాది క్రితం రికార్డ్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది మనోహరాబాద్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్నారు. సాయంత్రం గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఏడాది క్రితమే సారికతో వివాహమైంది.

News July 29, 2024

తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు పంపండి: డీఈవో2/2

image

ఉమ్మడి జిల్లా పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కోసం అన్ని పాఠశాలల HMలు తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను పంపాలని డీఈవో డా. గోవిందరాజులు తెలిపారు.9,10 తరగతుల విద్యార్థులు రూ.120 వంతున, ప్రయివేట్ యాజమాన్య పరిధిలోని పాఠశాలల్లో 6-8 విద్యార్థులు రూ.120,9,10 తరగతుల విద్యార్థులు రూ.150 వంతున చెల్లించాల్సి ఉంటుందని,ఫీజు వసూలు చేసి డీసీఈబీ కార్యదర్శి పేరుతో DDలు తీసి ఆగస్టు 31లోగా పంపాలన్నారు.

News July 29, 2024

WGL: ‘ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు tsscstudycircle.in లో చూడాలన్నారు.

News July 29, 2024

తరగతుల వారీగా విద్యార్థుల వివరాలు పంపండి: డీఈవో1/2

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరీక్షల బోర్డు (DCCB) ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కోసం అన్ని పాఠశాలల HMలు తరగతుల వారీగా విద్యార్థుల వివరాలను పంపాలని డీఈవో డా. గోవిందరాజులు తెలిపారు. ఎస్ఏ-1, ఎస్ఏ-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలను డీసీఈబీ ద్వారా అందజేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6-8 తరగతుల విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.