Telangana

News July 26, 2024

రామాయంపేట: చిరుతపులి దాడిలో ఆవు మృతి

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామ శివారులో చిరుతపులి సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి గ్రామానికి చెందిన కొత్తగారి రమేశ్ తన వ్యవసాయ పొలం వద్ద పశువును కట్టేసి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి ఆ పశువుపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రమేశ్ గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. జిల్లాలో చిరుత సంచారంతో జనం ఆందోళన చెందుతున్నారు.

News July 26, 2024

వరంగల్ మార్కెట్లో క్వింటా మక్కల ధర ఎంతంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గతవారం రికార్డు ధర పలికిన మొక్కజొన్న ధరలు ఈ వారం క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతవారం క్వింటా మక్కలు రూ.2,780 పలకగా.. ఈ వారం మూడు రోజులు రూ.2,750 పలికాయి. నిన్న కాస్త తగ్గి రూ.2,715 అయిన మొక్కజొన్న నేడు రూ.2705కి తగ్గిందని రైతులు తెలిపారు.

News July 26, 2024

NZB: హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ లోయర్ గ్రేడ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్స్ www.bse.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. 2024 సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 4న ఈ పరీక్ష ఉంటుందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News July 26, 2024

చిన్నారులపై పెరిగిన లైంగిక వేధింపులు: ఎంపీ చామల

image

దేశంలో చిన్నారులపై లైంగిక వేధింపులు పెరిగాయని లోక్‌సభ భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల సంక్షేమంలో 176 దేశాల్లో 113వ స్థానంలో భారత్
నిలవడం శోచనీయమని పేర్కొన్నారు. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించగా, దీనిపై కేంద్రమంత్రి అన్నపూర్ణ
దేవి స్పందిస్తూ మిషన్ వాత్సల్య యోజన ద్వారా దేశంలో చిన్నారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు.

News July 26, 2024

MLG: ఆగస్టులో పెళ్లి.. అంతలోనే కాటేసిన విధి

image

చెట్టు మీద పడడంతో జహంగీర్ <<13705294>>మృతి <<>>చెందిన విషయం తెలిసిందే. ఎస్సై తాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన ఎస్కే జహంగీర్ బీటెక్ చదువుకొని గ్రామంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నారు. మందుల కోసం ఏటూరునాగారం వెళ్తుండగా చెట్టు కూలి అక్కడికక్కడే మరణించారు. కాగా, ఆగస్టులో జహంగీర్‌కు పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు అనుకోగా అంతలోగా విధి చెట్టు రూపంలో కాటేసింది.

News July 26, 2024

భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News July 26, 2024

గ్రేటర్ HYDలో అదనంగా మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

News July 26, 2024

గ్రేటర్ HYDలో అదనంగా మరో 100 ఛార్జింగ్ స్టేషన్లు..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడున్న ఛార్జింగ్ స్టేషన్లకు అదనంగా మరో 100 స్టేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వివరాలు, వాటి వినియోగం కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. సంప్రదాయేతర, కాలుష్య రహిత విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన విద్యుత్ విధానాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

News July 26, 2024

అనారోగ్యంతో భద్రాచలం ఐటీడీఏ ఏవో మృతి

image

అనారోగ్యంతో ఐటీడీఏ ఏవో మృతి చెందిన ఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో ఏవో విధులు నిర్వహిస్తున్న పెందుర్ బీమ్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏవో మృతి పట్ల ఐటిడిఏ ఉద్యోగులు, ఐటిడిఏ పిఓ సంతాపం తెలిపారు.

News July 26, 2024

మెట్రో రైలు రెండో దశలో పెరిగిన దూరం

image

HYDలోని మెట్రో రైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి, 78.4 కి.మీ. అయింది. అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం రెండోదశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి భట్టి తన బడ్జెట్‌లో ప్రసంగంలో పేర్కొన్నారు.