India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన చంద్రకాంత్ అనే గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతి చెందాడు. అయితే 1992 నుంచి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్.. మరణం చెందటం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈనెల 2న మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం.

రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా వచ్చిన జిష్ణు దేవ్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు ఉన్నారు.

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.

కోల్‌కతాలో ఇటీవల జరిగిన 2వ ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. సీనియర్ విభాగంలో తక్కడ్‌పల్లి ప్రతిభ 5 గోల్డ్‌మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సాధించారు. బాన్సువాడకు చెందిన రుషాంక్ సబ్ జూనియర్ విభాగంలో 2 గోల్డ్ మెడల్స్, సీనియర్ విభాగంలో పిట్లంకు చెందిన విజయ్ రాఘవేంద్ర రావు 2 సిల్వర్ మెడల్స్ సాధించారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు.

సత్తుపల్లి మండలం గంగారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు బైక్‌పై వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామగోవిందాపురానికి చెందిన బేతి సురేశ్(25), ముత్తిన వేణు (18), కరీముల్లా (12)గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా కాంప్లెక్స్ హైస్కూల్ హెచ్ఎంలతో కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్లో జరుగుతున్న విషయాలపై ఆరా తీశారు. వెనుకబడిన పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పిల్లలకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ సబ్జెక్టులలో చదవడం, రాయడంపై ప్రత్యేక తరగతులు తీసుకోవాలన్నారు. అన్ని పాఠశాలలో బేసిక్ టెస్టులు నిర్వహించాలన్నారు.

సత్తుపల్లి మండలం గంగారం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న హరీశ్ రావుతోపాటు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇన్ని ఆంక్షలు లేవని, రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు.

అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి సమీపంలోని గోదావరిలో గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు.
Sorry, no posts matched your criteria.