Telangana

News August 29, 2024

నెల రోజులుగా గాంధీ చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీ

image

గాంధీ ఆస్పత్రిలో గత నెల రోజులకు పైగా చీఫ్ డైటీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. పేషంట్లు, డ్యూటీ డాక్టర్లకు రోజూ ఫుడ్ అందించే డైట్ క్యాంటీన్‌లో చీఫ్ డైటీషియన్ పోస్ట్ ఖాళీ అవ్వడంతో పర్యవేక్షణలో లోపాలు ఉంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి డైటిక్స్‌లో డైటీషియన్, చీఫ్ డైటీషియన్ 2 పోస్టులు ఉండాల్సి ఉంది. కానీ, చాలా కాలంగా డైటీషియన్ పోస్ట్ ఖాళీ ఉండగా గత నెల చీఫ్ డైటీషియన్ బదిలీపై వెళ్లిపోయారు.

News August 29, 2024

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం

image

డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితర ముఖ్య నాయకులు గురువారం తన స్వాగతం పలికారు. నందిగామ మండలంలోని చేగూరు గ్రామ సమీపంలో ఉన్న కన్హా శాంతి వనం లో వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆయన హాజరయ్యారు. తిమ్మాపూర్ వద్ద ఆయనకు ఘనస్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తదితరులు ఉన్నారు.

News August 29, 2024

మాదాపూర్: దుర్గం చెరువులోని 204 భవనాలకు నోటీసులు

image

హైడ్రా కూల్చివేతలతో ఆక్రమణదారులు హడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల GHMC అధికారులు 204 ఇళ్లకు నోటీసులివ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో CM సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ, రాజకీయ, ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్‌లో ఉన్న ఇంటిపై ఎఫ్ అని మార్కింగ్ కూడా చేశారు.

News August 29, 2024

రిమ్స్‌లో MBBS ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆల్ ఇండియా MBBS కోటా ప్రవేశాల గడువును పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29తో ముగుస్తున్న గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆల్ ఇండియా కోటాలో రిమ్స్‌కు 15 సీట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవలం ఐదుగురు విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు. గడువు పొడిగించి విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు.

News August 29, 2024

రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు

image

రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకొని సెల్ఫీ ఫొటో తీసుకుంటూ వివరాలను నమోదు చేస్తున్నారు. రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ కాని రైతులు తప్పనిసరిగా వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు.

News August 29, 2024

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.9 టీఎంసీల నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గానూ16.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి  3,531 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదేవిధంగా 10,134 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది.

News August 29, 2024

కాటారంలో దొంగల బీభత్సం

image

కాటారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని బస్వాపూర్‌లో అర్ధరాత్రి 2గం.కు ఓ ఇంట్లోకి చోరబడ్డారు. ఇంట్లోని రూ.లక్ష, 5 తులాల బంగారం, ఒక బైకును ఎత్తుకెళ్లారు. ఇంతటితో ఆగకుండా ఇంటియజమాని తిరుపతిని కట్టేసి అతడి భార్య గొంతు కోశారు. విషయం తెలుసుకున్న కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

HYD: సుందరీకరణ మాటున చెరువుల ఆక్రమణలు

image

గ్రేటర్ పరిధిలో చెరువులను సుందరీకరణ పేరుతో సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత ముసుగులో అక్రమాలకు తెరతీశాయి. శేరిలింగంపల్లి, గండిపేట్ మండలాల్లో చెరువులను సంరక్షిస్తామని కొన్ని రియల్ సంస్థలు జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకొని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్‌లను ఆక్రమించుకుంటున్నాయి. స్థానికంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మాణ వ్యర్ధాలను చెరువులో కలుపుతున్నాయి.

News August 29, 2024

నవీపేట్: పెళ్లిలో మటన్ కోసం కొట్టకున్న బంధువులు

image

పెళ్లిలో మటన్ కోసం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు బంధువులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన నవీపేట్‌లో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు తరఫు వారికి మటన్ తక్కువగా వేశారని గొడవ పడ్డారు. దీంతో కర్రలు, రాళ్లతో దాడి చేసుకొన్నారు. కాగా ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 29, 2024

MBNR: ఫలితాల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 508 ఖాళీలు ఉన్నాయి. 14,577 మంది అభ్యర్థులు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలకు హాజరయ్యారు. ప్రాథమిక కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు. తుది కితో పాటు ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.