India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పదస్థితిలో ఒక మహిళ దుర్మరణం పాలైనట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. మృతురాలు గోదావరి నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మ అనే మహిళ ఈనెల 25 నుంచి కనిపించకుండా పోయింది. మృతురాలు పద్మ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

భూత వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న దమ్మపేటకు చెందిన రేపల్లె తిరుపతిపై ఎస్సై గణేశ్ శనివారం బైండోవర్ కేసు నమోదు చేశారు. నిందితుడు దుమ్ముగూడెం మండలంలోని గ్రామాల్లో తిరుగుతూ అమాయక ప్రజలను అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దెయ్యం పట్టిందని వదిలిస్తానని నమ్మించి వేలాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అశోక్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్(46) తన కొడుకు ఇటీవల మృతి చెందడంతో మానసిక వేదనకు గురై శనివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భార్య మాధవి మూడు రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కొడుకు విశాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రాజీవ్ గాంధీ క్విజ్ కాంపిటీషన్ పేరిట జూన్ 2023లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించింది. ప్రతీ నియోజకవర్గంలో మొదటి 40 స్థానాల్లో ఉన్నవారికి ప్రైజులు ఇస్తామని ప్రకటించగా పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. పరీక్ష ముగిసి ఏడాది దాటినా ఫలితాల ఊసే లేదు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలు, ప్రైజుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చారు కదా ఇప్పటికైనా ఇస్తారేమో అని యువత చర్చించుకుంటున్నారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో: 52,471 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 5,944 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 509 అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 129.9780 టీఎంసీలు

తూప్రాన్ మం. వెంకటాయపల్లికి చెందిన అశోక్, కనకమ్మ దంపతులు 20ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా ములుగుకు వచ్చారు. వారి కొడుకు సాయికుమార్‌కు కావ్యతో పెళ్లైంది. కాగా 4నెలల క్రితం కావ్య అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం కొత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. 4నెలల క్రితం తల్లి, తాజాగా తండ్రి మృతితో వారి ఏడాదిలోపు చిన్నారి అనాథగా మారింది. ఘటనపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

HYD నగరంలో నేడు జరగబోయే బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. జడ్సీలు, డీసీలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఇతర ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయాల చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.

HYD నగరంలో నేడు జరగబోయే బోనాల ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. జడ్సీలు, డీసీలకు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు, ఇతర ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయాల చుట్టూ పరిశుభ్రంగా ఉండాలన్నారు.

శనివారం<<13717360>> రైలుకిందపడి<<>> ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన సంబంధించిన పూర్తి వివరాలిలా.. నల్లబెల్లికి చెందిన వడ్లూరి సత్యం (43) ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసేవారు. ఓ ప్రమాదంలో తలకు గాయమైనప్పటి నుంచి మానసిక సమస్యలతో బాధపడుతూ.. ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య రాణి స్థానిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భార్యకు భారమవుతున్నాననే బాధతో.. శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

శుక్రవారం మంచిర్యాల ఏసీసీ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గద్దెరాగడికి చెందిన రాజు(30) శుక్రవారం రాత్రి ఏసీసీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఈక్రమంలో నస్పూర్‌కు చెందిన వినయ్‌కుమార్(27) బైక్‌తో ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజు అక్కడికక్కడే మృతి చెందగా.. వినయ్‌కుమార్ శనివారం HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.