India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు గుండు శివకు మార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు. ఈరోజు ఉగాది పచ్చడికి వినియోగించే మామిడి కాయలు, బెల్లం, వేపపువ్వు, చెరకు గడలు, ఆహ్లాదకర వాతావరణం, పచ్చని చెట్లు, కోయిలలు, చిలకలు, ఉగాది పచ్చడితో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న మహిళ చిత్రాలను గీసి క్రోధి నామ సంవత్సరానికి ఆయన స్వాగతం పలికారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపే మండలానికి చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.
ధర్మారం మండలం నర్సింగాపూర్‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసన చేపట్టింది. MNCL జిల్లా కాసిపేటకు చెందిన స్వాతికి గతంలో వివాహమై భర్త మరణించాడు. దీంతో KNR కూల్ డ్రింక్స్ కంపెనీలో పనిచేస్తోంది. దూరపు బంధువైన శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈక్రమంలో శ్రీనివాస్ రెడ్డి పెళ్లికి నిరాకరించడంతో యువతి అతడి ఇంటి ముందు బైఠాయించింది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. నేటి నుంచి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే అంచనాతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై PSల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.
అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై PSల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.
ధర్మారం మండలంలో ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి ఆదివారం సాయంత్రం ఆడుకుంటుండగా తాత వరుసైన వృద్ధుడు తన నివాసంలోకి తీసుకెళ్లాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు అతడిని మందలించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
చేపల మార్కెట్లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన వెంకటాపురం మండలంలో చోటుచేసుకుంది. మార్కెట్లో చేపల విక్రయిస్తున్న నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తిపై వంశీ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అశోక్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వంశీని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించి పోలీసులకు అప్పగించిన ఘటన వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీలో చోటు చేసుకుంది. నిజామాబాద్ గాజుల్ పేటకు చెందిన గుండమల్ల గంగాధర్ ఎలుకుర్తి హవేలిలో అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో గ్రామస్థులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులు వచ్చి అతన్నిపోలీస్ స్టేషన్ తరలించారు. గంగాధర్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండగ నేపథ్యంలో కుమ్మరులు ఉపాధి పొందుతున్నారు. పండగ వేళ షడ్రుచులతో కూడిన పచ్చడిని మట్టి పాత్రల్లో తయారు చేసి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. పండగను దృష్టిలో పెట్టుకుని HYD, ఉమ్మడి RRలోని కుమ్మరులు నెల రోజుల నుంచే మట్టి పాత్రలను ప్రత్యేకంగా తయారు చేశారు. వారం రోజుల నుంచి ప్రధాన కూడళ్లలో విక్రయానికి ఉంచారు. పాత్ర పరిమాణాన్ని బట్టి రూ.80-రూ.120 వరకు విక్రయిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.