Telangana

News July 30, 2024

HYD: BRSలోకి‌ కాంగ్రెస్ MLA.. క్లారిటీ

image

సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. అటువంటి వార్తలను నమ్మొద్దని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బీ‌ఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఈ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుతున్నారని‌ వార్తలు వస్తున్నట్లు గుర్తు చేశారు. కానీ, ఆ జాబితాలో తాను లేనన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని కాలే యాదయ్య స్పష్టం చేశారు.

News July 30, 2024

రవీంద్ర భారతిలో చిన్నారెడ్డికి సన్మానం

image

హైదరాబాద్ రవీంద్రభారతిలో సినారే, దాశరధి జయంతి వేడుకలను తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, సిల్వర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల కమిటీ సభ్యులు చిన్నారెడ్డిని తలపాగా శాలువా, మెమొంటోలతో సత్కరించారు. నిర్వాహకులు, ప్రముఖులు, సాహిత్య, కళాభిమానులు పాల్గొన్నారు.

News July 30, 2024

గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు: ఓబేదుల్లా కొత్వాల్

image

గత బీఆర్ఎస్ పాలకులు కేవలం మాటలకే పరిమితమయ్యారని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ. 7 లక్షల కోట్లు అప్పుచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. గడిచిన 10 సంవత్సరాల పాటు కేవలం హంగు, ఆర్భాటాలకు పోయారు తప్ప చేసింది మీ లేదని విమర్శించారు.

News July 30, 2024

పెద్దశంకరంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన వడ్ల విజయ్ కుమార్(32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక ప్రియాంక కాలనీకి చెందిన విజయ్ మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లు వివరించారు. దీంతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.

News July 30, 2024

SRSP అప్డేట్: 12,785 క్యూసెక్కులకు తగ్గిన ఇన్ ఫ్లో

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ఇన్ ఫ్లో తగ్గుతోంది. మంగళవారం ఉదయం10 గంటలకు 22,885 క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో రాగా మధ్యాహ్నం 3 గంటలకు 17,100 క్యూసెక్కులుగా తగ్గింది. రాత్రి 9 గంటలకు మరింతగా 12,785 క్యూసెక్కులకు తగ్గింది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80 TMC లకు గాను ప్రస్తుతం 35.777 TMC ల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

News July 30, 2024

ఇన్వెస్టిగేషన్‌లో లోపాలు ఉంటే సహించేది లేదు: ఎస్పీ రూపేశ్

image

ఇన్వెస్టిగేషన్‌లో లోపాలు ఉంటే సహించేది లేదని ఎస్పీ రూపేశ్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అర్ధ వార్షిక సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగదు రికవరీ చేసేలా చూడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు పాల్గొన్నారు.

News July 30, 2024

ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ, పీజీలో ప్రవేశాలు షురూ

image

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. AUG 18 వరకు ONLINEలో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరాలకు https://www.braouonline.in/ సందర్శించండి.

News July 30, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.71,003 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.43,412, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.18,650, అన్నదానం రూ.8,941,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News July 30, 2024

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.50,28,595

image

మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని మాత ఆలయం హుండీని మంగళవారం లెక్కించారు. భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న హుండీ ఆదాయం రూ.50,28,595 వచ్చినట్లు ఆలయ ఛైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఈవో డి.కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

News July 30, 2024

HYD: అత్యాచారం.. ఆస్ట్రేలియా‌కు పారిపోతుండగా అరెస్ట్

image

యువతిని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అమ్మాయితో స్వామికి FBలో పరిచయమైంది. ఆమెను HYDకి రప్పించిన అతడు పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడు. చివరకు ఆస్ట్రేలియా పారిపోయేందుకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదుతో మహంకాళీ పోలీసులు ఎయిర్‌పోర్ట్‌లోనే స్వామిని అరెస్ట్ చేశారు. CI పరశురాం, SIలు వెంకటేశ్వర్లు, పరదేశి జాన్, కానిస్టేబుల్స్ వంశీ, రుషి చరణ్ సిబ్బంది ఉన్నారు.