India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

@ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు @ ప్రస్తుత నీటి మట్టం 526.40 అడుగులు@ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు.@ ప్రస్తుత నీటి నిల్వ 161.2064టీఎంసీలు@ ఇన్ ఫ్లో: 2,18,560 క్యూసెక్కులు@ ఔట్ ఫ్లో: 6,782 క్యూసెక్కులు

షాద్‌నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. 25-30ఏళ్లు ఉన్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్టేషన్ మాస్టర్ రాహుల్ ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ తెలిపారు. మృతుడు గ్రే కలర్ రెయిన్ కోర్టు, గ్రీన్ కలర్ టీ షర్ట్ ధరించాడని, ఎవరైనా గుర్తిస్తే షాద్ నగర్ రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రం ధర్మపురి కాలనీకి చెందిన తుమ్మల లక్ష్మి (32) అనే వివాహిత బుధవారం బాసరలోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గణేష్ ఘాట్ వద్ద ఉన్న ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ ఆధారంగా బంధువులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.

మహేశ్వరం MLA, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి బతుకు బస్టాండ్ అంటూ అసెంబ్లీలో అగౌరవపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని BRS సీనియర్ నేత, ఆ పార్టీ మీర్‌పేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. సీఎం మాటలకు నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని ఆయన నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరిచి మాట్లాడటం సరికాదన్నారు.

నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఆగస్టు 2న ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే.లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ఇంటర్మీడియేట్, డీగ్రీ, బీటెక్ అర్హతలు ఉండి ఆసక్తి ఉన్న అభ్యర్థులు శివాజీ నగర్ లోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 2న ఉదయం 10.30 గం’ల నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని ఆయన సూచించారు.

భూముల విలువను ప్రభుత్వం పెంచుతున్నట్టు ప్రచారంతో రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతున్నాయి. మొన్నటి వరకు 10, 20 రిజిస్ట్రేషన్లు అయ్యేచోట 40 నుంచి 50 వరకు, 70, 80 అయ్యే చోట 150 నుంచి 180 వరకు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఆగస్టు 1 నుంచే ధరలు పెరుగుతాయని ప్రచారం సాగుతుండటంతో వారం రోజులుగా ఉమ్మడి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి.

రుణమాఫీ రెండో విడతకు సంబంధించి మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో 1,04,113 మంది రైతులను రాష్ట్ర ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. వీరు వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రూ.1.50 లక్షల లోపు రుణాలు మొత్తం రూ.1,023 కోట్లు కాగా.. వీటిని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఆగస్ట్ 15 నాటికి మూడో విడత రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం మణుగూరు మండల పరిధిలోని మల్లారంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన శేఖర్ అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించగా అప్పటికే మృతి చెందాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. తంగేడు వనం వద్ద రెండు లారీలు ఢీకొట్టుకోవడం భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాదు నుంచి చౌటుప్పల్ వైపు బీర్ల లోడుతో వస్తున్న లారీని అదే వైపు ఉల్లిగడ్డ లోడుతో వస్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.