Telangana

News August 1, 2024

UPDATE.. హృదయాలను కలిచివేసిన మెదక్ యాక్సిడెంట్

image

మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరిగిన <<13746227>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన గర్భిణి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి చెందిన పనేటి రేణ(29)గా గుర్తించారు. ఎస్సై సుభాశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. బైకుపై మరో వ్యక్తి, బాలుడితో కలిసి వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గర్భిణి నుజ్జునుజ్జు కాగా కడుపు నుంచి పిండం రోడ్డుపై పడి పలువురి హృదయాలను కలిచివేసింది.

News August 1, 2024

KMR: అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. పంచలోహ విగ్రహం స్వాధీనం

image

కామారెడ్డిలో అంతర్ జిల్లా దొంగను కామారెడ్డి పట్టణ, సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకుని పంచలోహ విగ్రహం స్వాధీనం చేసుకున్నామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దొంగను నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన చిల్లా గంగాదాసుగా పేర్కొన్నారు. అతడు మాక్లూర్ మండలం మాదాపూర్‌కు చెందిన దర్పల్లి సాయిలు, నిర్మల్ జిల్లాకు చెందిన కోసడిగి మోహన్లతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు.

News August 1, 2024

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన

image

నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో అమానవీయ ఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందనో .. అనారోగ్యంతో మరణించిందో తెలియదు కానీ బుధవారం నవజాత శిశువును చెత్తకుప్పలో పడేశారు. ఎస్ఐ నరేశ్ వివరాల ప్రకారం.. అనంతసాగర్ చెరువు సమీపంలోని చెత్తలో రెండు రోజుల క్రితం జన్మించిన శిశువు మృతదేహం లభించిందని తెలిపారు. శిశువును నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

News August 1, 2024

వెజ్ ఆర్డర్లలో HYDకు మూడో స్థానం

image

శాఖాహార వంటల ఆర్డర్లలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచిందని స్విగ్గీ ప్రకటించింది. మసాలా దోశ, ఇడ్లీలను హైదరాబాదీలు ఎక్కువమంది ఇష్టపడుతున్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న 10 వంటకాల్లో 6 శాఖాహారం వంటకాలు ఉన్నాయని పేర్కొంది. తొలి రెండు స్థానాల్లో బెంగళూరు, ముంబై నగరాలు నిలిచాయి.

HYD నగరవాసులకు BIG ALERT

image

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం GHMC ప్రజాపాలన సేవాకేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సమాచారం, అప్లికేషన్ స్టేటస్ కోసం 6 జోన్లలోని 30 సర్కిళ్లలో 150 వార్డుల్లో కేంద్రాల్లో సంప్రదించేలా వీటిని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సందేహాలకు నగర ప్రజలు ఏ సేవాకేంద్రంలో అయినా సంప్రదించవచ్చని తెలిపింది.

News August 1, 2024

కరీంనగర్ జిల్లాపై డెంగీ పంజా!

image

కరీంనగర్ జిల్లాలో డెంగీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరీంనగర్ మండలంలో బుధవారం మరో 2 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో నెల రోజుల వ్యవధిలోనే డెంగీ కేసులు 26కు చేరుకున్నాయి. ఇవి అధికారిక లెక్కలే కాగా.. అనధికారికంగా ఎన్ని కేసులు ఉన్నాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. డెంగీతో పాటు జిల్లాలో టైఫాయిడ్, వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News August 1, 2024

HYD నగరవాసులకు BIG ALERT

image

ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సులభతరం చేసేందుకు ప్రభుత్వం GHMC ప్రజాపాలన సేవాకేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి సమాచారం, అప్లికేషన్ స్టేటస్ కోసం 6 జోన్లలోని 30 సర్కిళ్లలో 150 వార్డుల్లో కేంద్రాల్లో సంప్రదించేలా వీటిని తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని, సందేహాలకు నగర ప్రజలు ఏ సేవాకేంద్రంలో అయినా సంప్రదించవచ్చని తెలిపింది.

News August 1, 2024

సూర్యాపేట: టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం!

image

సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రోడ్డుప్రమాదాలు, వాహనదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని ఆర్‌అండ్బీ, వ్యవసాయ శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు NHAI అధికారులను బుధవారం కోరడంతో వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే వాెహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి.

News August 1, 2024

హనుమకొండ: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

హనుమకొండ జిల్లాలో విషాదం జరిగింది. ఓ ఇంటర్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములుగు జిల్లా మంగపేటకు చెందిన భవానీ హనుమకొండలోని వైబ్రంట్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. విద్యార్థిని మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి పోలీసులు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.