Telangana

News August 9, 2024

కరీంనగర్: దళితబంధుపై ‘కాగ్’ సంచలన నివేదిక

image

గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళిత బంధుపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా) లోపాలను ఎత్తిచూపింది. హుజూరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో పథకం అనుకున్న మేర అమలు కాలేదని, తీవ్ర జాప్యం జరిగిందని స్పష్టం చేసింది. అసలు దళితబంధు కోసం కేటాయించిన నిధుల్లో ప్రభుత్వం కేవలం 47 శాతం ఖర్చు చేసిందని, దాదాపుగా రూ.1300 కోట్లకు పైగా ఇంకా అలాగే ఉండిపోయాయని తన నివేదికలో వివరించింది.

News August 9, 2024

నాగర్‌కర్నూల్ యువకుడికి 5 GOVT JOBS

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన యువకుడు పోటీ పరీక్షల్లో సత్తాచాడు. ఒకే ప్రయత్నంలో ఏకంగా 5 ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులు, స్నేహితులు, గ్రామస్థుల అభినందనలు పొందాడు. అతడే బిజినేపల్లి మండలానికి చెందిన మాకం ఆంజనేయులు లావణ్య దంపతుల కొడుకు జీవన్ కుమార్. జీవన్ 3 గెజిటెడ్ ఉద్యోగాలు AEE, AE, PLతోపాటు గ్రూప్-4, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం(SSC JE) సాధించాడు. AEE ఉద్యోగంలో చేరుతానని జీవన్ అన్నారు.

News August 9, 2024

NLG: ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు

image

నల్గొండ జిల్లా పెద్ద అడిశర్ల పల్లి మండలం చింతల్ తండాకు చెందిన రామావత్ రాందాస్ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. ఎస్ఎస్సీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020, 2021లో, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2022, 2023లో అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ కేంద్ర హోం శాఖలో ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ బెంగుళూరులో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు.

News August 9, 2024

ఆర్టీసీ బస్సు అద్దెకు తీసుకున్న వారికి 10 శాతం రాయితీ

image

శ్రావణమాసంలో పెళ్లి ముహూర్తాల నేపథ్యంలో ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్న వారికి 10 శాతం డిస్కౌంట్ ఉంటుందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన తెలిపారు. డిపాజిట్ లేకుండా ప్రయాణించే కాలానికి, దూరానికి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని పేర్కొన్నారు. నేటి నుంచి సెప్టెంబర్ మూడో తేదీ వరకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకునే బస్సులకు 10 శాతం డిస్కౌంట్ కూడా ఉంటుందన్నారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News August 9, 2024

ఖమ్మం: స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా?

image

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. గడువు ముగిసిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్లకు ఎన్నికలు నిర్వహించేందుకు SC, ST, BC రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన నిర్ధారిస్తారన్న దానిపై ప్రభుత్వపరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామపంచాయతీలు ఉన్నాయి.

News August 9, 2024

కేయూలో ఆదివాసీ దినోత్సవం

image

కాకతీయ యూనివర్సిటీ ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఫస్ట్ గేట్ నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వరకు ర్యాలీ తీసి ఆదివాసీ సంస్కృతి, వేషధారణతో విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. పెద్ద ఎత్తున కేయూ విద్యార్థులు ఆదివాసీ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

News August 9, 2024

NZB: ఏసీబీ దాడుల్లో భారీగా బంగారం, నగదు గుర్తింపు?

image

NZB అశోక్ టవర్స్‌లో నివాసం ఉంటున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జ్ ఆర్వో నరేందర్ ఇంట్లో శుక్రవారం జరుగుతున్న ఏసీబీ సోదాల్లో భారీగా బంగారం, నగదు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ అధికారులు నరేందర్ ఉంటున్న ఇంటితో పాటు కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లీ, నిర్మల్‌లోని బంధువుల ఇంట్లో సోదాలు జరుపుతున్నారు.

News August 9, 2024

HNK: పైపులో ఇరుక్కుపోయిన కుక్క తల

image

ఆహారం కోసం ఎదురు చూస్తూ పైపులో కుక్క తలపెట్టి అందులోనే ఇరుక్కుపోయి 3 రోజులు నరకయాతన అనుభవించింది. HNK శ్యామల దుర్గాదాస్ కాలనీలో మూడు రోజుల కిందట రోడ్డు పక్కన పడి ఉన్న ప్లాస్టిక్ పైపులో కుక్క తల దూర్చింది. ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోవడంతో అరుస్తూ వీధుల్లో సంచరించింది. వడ్డేపల్లి పశువైద్యాధికారి ప్రవీణ్ కుమార్ కుక్కకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పైపు కోసి కుక్కను రక్షించారు.

News August 9, 2024

పాలమూరులో జాతీయ రహదారులకు రూ.1,205.9 కోట్లు

image

పాలమూరులో హైవేల నిర్మాణానికి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.1,205.975 కోట్లు కేటాయించింది. MBNR-చించోళి రోడ్డు నిర్మాణానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో కొడంగల్‌ వరకు రూ.379.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. పాలమూరులో ఇప్పటికే హైవే పనులు జరుగుతున్నాయి. దీంతో HYD-బెంగళూరు హైవేపై ఉన్న 37 బ్లాక్‌ స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల అండర్‌పాసు లేదా సర్వీసు రోడ్లు నిర్మించే అవకాశాలున్నాయి.

News August 9, 2024

వరంగల్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన WH మిర్చి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్నటిలాగే రూ.18,000 పలికింది. అలాగే 341 రకం మిర్చికి సైతం నిన్నటి లాగే కూడా రూ.14 వేలు పలికింది. అయితే వండర్ హాట్(WH) మిర్చి ధర మాత్రం నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగింది. నిన్న రూ.14,500 పలికిన మిర్చి నేడు రూ.15,500కి చేరింది.