Telangana

News August 11, 2024

రిమ్స్‌లో ఈ నెల 13న చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని డైస్ సెంటర్‌లో చిన్నారులకు ఈ నెల 13న ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ తెలిపారు. ఆర్బీఎస్కేలో 18 లోపు వయస్సు గల పిల్లలకు గుండె సంబంధిత సమస్యలకు పరీక్షలు చేయనున్నారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌లోని పీడియాట్రిక్‌ కార్డియాలజిస్టులు బాధిత చిన్నారులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందజేస్తారని పేర్కొన్నారు.

News August 11, 2024

ఇనుగుర్తి: విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతి

image

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనం సోమయ్య (60) అనే వ్యక్తి పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళగా కరెంటు షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సోమయ్యతో పాటు రెండు మూగజీవులు (కుక్క, కోతి) మృతిచెందాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

News August 11, 2024

BREAKING.. HYDలో గొంతు కోసి హత్యాయత్నం

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

BREAKING.. HYDలో గొంతు కోసి హత్యాయత్నం

image

HYDలో మరో దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బోరబండ పీఎస్ పరిధి కార్మికనగర్‌లోని NI-MSME గ్రౌండ్‌లో గుర్తు తెలియని వ్యక్తిపై దుండగులు దాడి చేసి, అతడి గొంతుకోసి హత్యాయత్నం చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొన ఊపరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 11, 2024

KTDM: భద్రతా బలగాలకు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు

image

చర్ల సరిహద్దు ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. తుమ్నార్ అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నట్లు భద్రత సిబ్బంది పేర్కొన్నారు.

News August 11, 2024

గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీ వైపు?

image

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అనే స్పష్టత లేదు. BRS నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 2 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 రోజుల క్రితం కేటీఆర్‌తో సమావేశమై BRSలో కొనసాగుతానన్నారు. పది రోజుల క్రితం మళ్లీ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమై బుజ్జగించారు. ఏ పార్టీ కండువా వేసుకోకుండా ఉంటుండడంతో చర్చనీయాంశంగా మారారు.

News August 11, 2024

సీఎం పర్యటన.. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ ఏర్పాట్ల పరిశీలన

image

వైరాలో జరుగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆదివారం మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. తదనంతరం అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు.

News August 11, 2024

HYD: ఇక సిటీ మొత్తం సీసీ కెమెరాలు!

image

హైదరాబాద్ నగరం మొత్తం ఇక సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండనుంది. HYD కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కోసం రూ.50 కోట్లు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా మహిళ భద్రత కోసం నిర్భయ కింద ప్రత్యేక కేటాయింపులు జరిపింది. నగరాన్ని భద్రతా వలయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపింది.

News August 11, 2024

HYD: ఇక సిటీ మొత్తం సీసీ కెమెరాలు! 

image

హైదరాబాద్ నగరం మొత్తం ఇక సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉండనుంది. HYD కమిషనరేట్ పరిధిలో సీసీటీవీ సర్వైలెన్స్ కోసం రూ.50 కోట్లు, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి రూ.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. సేఫ్టీ ప్రాజెక్టులో భాగంగా మహిళ భద్రత కోసం నిర్భయ ఫండ్ కింద ప్రత్యేక కేటాయింపులు జరిపింది. నగరాన్ని భద్రతా వలయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపింది.

News August 11, 2024

కొత్తగూడెం: హెచ్ఎంకు నోటీసులు.. డిప్యూటీ వార్డెన్ సస్పెండ్

image

కొత్తపల్లి ఆశ్రమ గిరిజన పాఠశాలలో 8వ తరగతి దీపక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, విద్యార్థి మృతికి కారకులైన పాఠశాల హెచ్ఎంకు నోటీసులు, డిప్యూటీ వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు హెచ్ఎంకు నోటీసులు, డిప్యూటీ వార్డెన్ హరికృష్ణను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.