India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ వైపు సాగు నీటి కొరత.. మరో వైపు దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.
రాష్ట్రస్థాయి పోటీ పరీక్షలతో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉచిత శిక్షణకై ఎస్సీ అభ్యర్థులకు ఈనెల 10న స్పాట్ అడ్మిషన్స్ జరగనున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి తెలిపారు. 100 సీట్లకు గాను.. 45 సీట్లు భర్తీ కాగా మిగిలిన 55 సీట్లకు సిరిసిల్ల చంద్రంపేటలోని ఎస్సి స్టడీ సర్కిల్లో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించబడునన్నారు. ఎంపికైన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ ఉంటుందన్నారు.
DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కళ్యాణానికి తెలంగాణా రాష్ట్ర గవర్నర్ సిపి. రాధాకృష్ణన్ ను సోమవారం ఆలయ ఈవో రమాదేవి ఆహ్వానించారు. ఈనెల 17న జరిగే సీతారాముల కళ్యాణం, 18న జరిగే మహాపట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావాలని గవర్నర్‌కు దేవస్థానం ఈఓ రమాదేవి, అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
సివిల్ అభ్యర్థుల కోసం నారాయణ IAS అకాడమి ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. ఏపీ రిటైర్డ్ CS మోహన్ కందా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మొదలైన ప్రముఖులు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రిపరేషన్‌లో రీసెర్చ్ & డెవలప్‌మెంట్ విధానాలు వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నానని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, పార్టీ మారిన వారితో ఎలాంటి నష్టం లేదని, పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి బీఆర్ఎస్‌లో చేర్చుకునే ఆలోచన లేదని అన్నారు.
DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
మామిడి రైతుకు గడ్డుకాలమొచ్చింది. పూత, కాత కాసినప్పటికీ అధిక ఉష్ణోగ్రత, తెగుళ్లతో అంతా రాలిపోతుంది. ఫలితంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మెదక్ జిల్లావ్యాప్తంగా 2,600 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. వీటిలో సింహభాగం బంగినిపల్లి రకం సాగు చేశారు. కాగా మామిడికి పూత ఏటా డిసెంబర్ నెలాఖరున వస్తుండగా ఈ ఏడాది జనవరిలో వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
వందరోజుల కాంగ్రెస్ పాలనలో 2014కి ముందు ఉన్న దుర్భర పరిస్థితులు వచ్చాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కరవు తాండవిస్తుందని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఇంతవరకు స్పందన లేదన్నారు. కేసీఆర్‌ను భయపెట్టే మగాడు ఇంకా పుట్టలేదన్నారు.
26ఏళ్ల యశస్వినిరెడ్డి గెలుపుతో రాష్ట్రమంతా పాలకుర్తి వైపు చూసిందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్నేళ్లుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి కుటుంబం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. రాక్షస పాలన నుంచి యశస్విని రెడ్డి అందరికీ విముక్తి కల్పించారని కొనియాడారు. మీ అందరితో కలిసి నడుద్దామని తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
Sorry, no posts matched your criteria.