Telangana

News August 12, 2024

HYD: రూ.3,849 కోట్లతో.. 39 మురుగు శుద్ధి ప్లాంట్లు

image

HYDలో ఇక మురుగు శుద్ధి 100% జరగనుందని అధికారులు చెబుతున్నారు. రూ.3,849 కోట్లతో 39 సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(STP)లను నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమృత 2.0 ట్రాంచి -3 ప్రోగ్రాంలో భాగంగా నిర్మించనున్నారు. మొత్తం వీటిని 2 ప్యాకేజీలలో పూర్తి చేయనున్నారు. మొదటి ప్యాకేజీలో 16, రెండో ప్యాకేజీలు 22 పూర్తి కానుండగా.. వీటితో 972 MLD మురుగునీరు శుద్ధి కానుంది.

News August 12, 2024

ఓపెన్ డిగ్రీ, డిప్లమా, PG చేయాలని ఉందా!

image

HYDలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లమా, సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 31 దరఖాస్తుకు చివరి తేదీగా ప్రకటించారు. www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా ఓపెన్ కోర్సులకు దరఖాస్తు చేసుకొని ఉన్నత విద్య అభ్యసించవచ్చని తెలిపారు. స్థానిక స్టడీసెంటర్లో నమోదు చేసుకోవాలన్నారు.

News August 12, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,39,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,66,512, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,38,000, అన్నదానం రూ.34,865, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 11, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
✔సుంకేసులకు పెరిగిన వరద.. 7 గేట్లు ఓపెన్
✔మహబూబ్‌ నగర్‌లో శ్రీముఖి సందడి
✔జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చేలా కృషిచేస్తా:TWJF
✔విద్యార్థుల వివరాలు నమోదు చేయండి: DEOలు
✔స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:BC స్టడీ సర్కిల్
✔పలుచోట్ల సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
✔అలంపూర్: కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారు

News August 11, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఆర్మీ జవాన్లే దేశంలో నిజమైన హీరోలు అన్న బండి సంజయ్. @ గోదావరిఖనిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి. @ సైదాపూర్ మండలంలో మృతిచెందిన వానరానికి అంత్యక్రియలు. @ ఓదెల మండలంలో శతాధిక వృద్ధురాలు మృతి. @ బుగ్గారం మండలంలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో బయటపడిన పాములు. @ మెట్పల్లి మండలం జగ్గాసాగర్ లో ఉచిత వైద్య శిబిరం.

News August 11, 2024

ఉమ్మడి NZB జిల్లాల్లోని నేటి ముఖ్యాంశాలు

image

*నిజామాబాద్‌లో అంబరాన్నంటిన బంజారా తీజ్ ఉత్సవాలు
*NZBలో వ్యక్తి అదృశ్యం.. బాసరలో మృతదేహం లభ్యం
*రైల్లో భారీగా నల్ల బెల్లం పట్టివేత
*షబ్బీర్ అలీని కలిసిన నిఖత్ జరీన్
*ఆర్మూర్: పిచ్చికుక్కల దాడి.. ఏడుగురికి గాయాలు
*భార్య కళ్ళ ముందే భర్త ఆత్మహత్య
*రుద్రూర్: నూతన గ్రామ పంచాయతీగా కొండాపూర్
*నిజాంసాగర్:చెరువులో పడి యువకుడు మృతి

News August 11, 2024

నిజామాబాద్: 11 మంది జూదరులు అరెస్ట్

image

నగరంలోని 4వ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆదివారం సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ పురుషోత్తం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11మంది జూదరులను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వారి 8 సెల్ ఫోన్లు, రూ.10,140 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై కేసు నమోదు చేసి 4వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

News August 11, 2024

HYD: JNTUలో ఒకేసారి 2 డిగ్రీలకు ఛాన్స్!

image

HYD జేఎన్టీయూలో బీటెక్ ఇంజనీరింగ్‌తో పాటు BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించనున్నట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సుమారు 5,000 మంది ఇంజనీరింగ్, మరో 5,000 నాన్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు JNTU దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.

News August 11, 2024

HYD: ఆలస్యం జరిగితే చెరువులు కనుమరుగు!

image

HYD మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న 3,500 చెరువులన్నింటిని 3 నెలల్లో బఫర్ జోన్లను గుర్తించి నోటిఫై చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జాప్యం జరిగితే అక్రమాలతో చెరువులే కనిపించకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామన్నకుంట చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని హ్యూమన్ రైట్స్ గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

News August 11, 2024

HYD: JNTUలో ఒకేసారి 2 డిగ్రీలకు ఛాన్స్!

image

HYD జేఎన్టీయూలో బీటెక్ ఇంజనీరింగ్‌తో పాటు BFSI బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ మైనర్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించనున్నట్లు జేఎన్టీయూ అధికారులు తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో సుమారు 5,000 మంది ఇంజనీరింగ్, మరో 5,000 నాన్ ఇంజనీరింగ్ నిపుణుల అవసరం ఉందని ఆ సంస్థ ప్రతినిధులు JNTU దృష్టికి తీసుకెళ్లగా.. ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.