India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.

ఆర్టీసీలో పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. HYDలోనూ రద్దీ ఉంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.ఈఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో1,354 మంది పదవీ విరమణ కానున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.

ఉత్తమ రక్తదాతగా డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి ఉగాది పురస్కారం అందుకున్నారు. మూడు దశాబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో రక్త, అవయవ దానాలపై విస్తృత ప్రచారం చేస్తూ, 52 మార్లు రక్తదానం చేసి లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ మెదక్ శాఖ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు 4,127 యూనిట్లను సేకరించగా రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక, సామాజిక సంస్థ ఈ అవార్డు అందజేసింది.
జగిత్యాల పట్టణంలో నివసిస్తున్న ఓ వివాహితతో TRనగర్‌కు చెందిన మోహన్ పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసుకుని.. కోరిక తీర్చమని లేకుంటే సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ బలవంతంగా అత్యాచారం చేశాడు. బెదిరింపులు భరించలేక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. నిందితుడిపై మొత్తం 13 కేసులున్నాయని పట్టణ సీఐ తెలిపారు.
HYD శివారు కీసర పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజాబాబాద్‌కి చెందిన అనిరుద్ CMR కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు బైక్‌పై వెళుతున్నాడు. ఈ క్రమంలో కీసర పరిధి కుందన్‌పల్లి-గోధుమకుంట మార్గంలో ఓ ఆటో ట్రాలీ, బుల్లెట్ బైక్ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. హెల్మెట్ లేకపోవడంతో అనిరుధ్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని గాంధీకి తరలించారు.
యువకుడు ఓ యువతిని హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. స్థానికుల వివరాలు.. కల్వకుంట తండాకు చెందిన చిట్టెమ్మ(28) భర్తతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా బిజినేపల్లికి చెందిన శివతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. నిన్న రాత్రి శివ ఫోన్ చేయడంతో వట్టెం శివారులోని పొలానికి వెళ్లింది. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణలో చిట్టెమ్మ చనిపోయింది. దీంతో మృతదేహాన్ని పత్తి చేనులో కప్పి నేడు పోలీసులకు శివ లొంగిపోయాడు.
Sorry, no posts matched your criteria.