India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యువకుడి ఆత్మహత్య కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా.. మనస్తాపం చెందిన యువతి భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకు వెళ్తున్నా అంటూ’ ఉరేసుకొన్నాడు.

వర్ధన్నపేట మండలం చెన్నారంలో దారుణం జరిగింది. మానసిక స్థితి కోల్పోయిన భర్త భార్యను కడతేర్చాడు. మామునూరు సీఐ రవికిరణ్ కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే హైదర్ కొంత కాలంగా మానసిక స్థితి కోల్పోయి తిరుగుతున్నాడు. కొద్దిరోజులుగా ఎవరూ కనిపించినా చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. మంగళవారం భార్యతో గొడవపడిన అతను టవల్‌తో గొంతు నులిమి చంపేశాడు. దీంతో శ్వాస ఆడక ఆమె ఘటనా స్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

ఎనుమాముల మార్కెట్‌లో పత్తి గరిష్ఠంగా రూ.7150 లు పలికింది. రూ.5000-6500 వరకు పత్తి నాణ్యతను బట్టి వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తంగా బుధవారం మార్కెట్‌కు 150 పత్తి బ్యాగులు వచ్చినట్లు మార్కెట్ వ్యాపారస్తులు, మార్కెట్ కమిటీ వారు తెలిపారు. కాగా, ఇదే పత్తి ధర నిన్న రూ.7180 లు గరిష్ఠంగా పలికింది. కాగా, నిన్నటికి ఇవాళ్టికి పత్తి ధరలో రూ.30 వ్యత్యాసం కనపడింది.

ఖమ్మం జిల్లాలో గురువారం CM రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఉ.11:45 గంటలకు HYD నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మ.12:50కు ములకలపల్లి(M) పూసుగూడెం చేరుకుంటారు. అనంతరం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అక్కడి నుంచి మ.3 గంటలకు వైరా చేరుకొని రూ.2 లక్షల రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

యువకుడి ఆత్మహత్య కేసులో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా.. మనస్తాపం చెందిన యువతి భవనం పైనుంచి దూకి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగేసి ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకు వెళ్తున్నా అంటూ’ ఉరేసుకొన్నాడు.

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(MOE) విడుదల చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) 2024లో NIT-వరంగల్ స్థానం సంపాదించింది. ఇంజినీరింగ్ కేటగిరీలో 21వ ర్యాంక్ సాధించిందని డైరెక్టర్ బిద్యధర్ సుబుధి ఓ ప్రకటనలో తెలిపారు. ఓవరాల్ కేటగిరీలో 53వ ర్యాంక్ పొందిందన్నారు. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటిసారి పాల్గొని 100వ ర్యాంక్‌ను పొందిందని వారు పేర్కొన్నారు.

షేక్ హసీనాను భారత్‌కు రానిచ్చారు కానీ అక్కడ బాధపడుతున్న హిందువులను బార్డర్‌లో అడ్డుకుని, ఎందుకు రానివ్వడం లేదని TPCC సీనియర్ ఉపాధ్యక్షుడు జీ.నిరంజన్ గాంధీభవన్‌లో ప్రశ్నించారు. బండి సంజయ్‌కు దమ్ముంటే జవాబు చెప్పాలన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుంటే చైనా ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బండిని కేబినెట్ నుంచి తొలగించాలన్నారు.

ములుగు జిల్లాలోని గురుకుల పాఠశాల భవనం పైనుంచి కిందపడి తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని కార్తీకకు సీఎం రేవంత్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మంగళవారం మంత్రి సీతక్క విద్యార్థిని ఆరోగ్య పరిస్థితులపై నిమ్స్ వైద్యుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. కాగా, కార్తీక ఈనెల 9న ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి పడిపోయిన విషయం తెలిసిందే. నడుము భాగంలో తీవ్ర గాయాలు కాగా, కార్తీక చికిత్స పొందుతోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లిలో 52.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 13.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా పెబ్బేరు లో 7.5 మిల్లీమీటర్ల, గద్వాల జిల్లా సాటేర్లలో 3.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా మద్దూరులో 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ఆయా జిల్లాలో జెండా ఎగరవేసే వారిని ప్రభుత్వం ప్రకటించింది. హనుమకొండ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతీయజెండా ఎగురవేయనున్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, భూపాలపల్లిలో అటవీశాఖ ఛైర్మన్ పోడెం వీరయ్య, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎగరవేస్తారు.
Sorry, no posts matched your criteria.