India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అచ్చంపేట మండలంలో <<13009166>>అత్తారింట్లో అల్లుడు సూసైడ్<<>> చేసుకున్నాడు. గోదల్ చెందిన సుభాష్‌రెడ్డికి రంగాపూర్ వాసి లోహితతో గతేడాది పెళ్లైంది. వారి మధ్య గొడవలతో లోహిత పుట్టింట్లో ఉంటుంది. నిన్న రంగాపూర్‌కు వెళ్లిన సుభాష్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొగా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. తనను హత్య చేయడానికి అత్తామామ, భార్య యత్నించారని వాంగ్మూలంలో సుభాష్ చెప్పినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదైంది.
మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు నాగరాజు మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. మార్చి 28న పాఠశాలలో విధులు ముగించుకొని చేగుంటలో తన నివాసానికి చేరుకున్న టీచర్ 29 నుంచి కనిపించకుండా పోయారు. 31న నాగరాజు కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నేటి వరకు సదరు టీచర్ ఆచూకీ లభించకపోవడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.
డా.బీఆర్. అంబేడ్కర్ డిగ్రీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మే 17 నుంచి 20వ తేదీ వరకు, మూడో సంవత్సరం పరీక్షలు వచ్చే నెల 17 నుంచి 22 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మిగతా వివరాలకు వెబ్సైట్ www.braouonline.in లేదా ఎంవీఎస్ కళాశాలలో సంప్రదించాలని కోరారు.
ఐటీ కారిడార్‌ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దే క్రమంలో గత BRS ప్రభుత్వం కోకాపేటలో సుమారు 534 ఎకరాల విస్తీర్ణంలో కోకాపేట నియోపోలిస్ లేఅవుట్‌ను HYD మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టింది. ఇందులో భాగంగానే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న ORR ట్రంపెట్ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. దీనిపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. నల్గొండలోని హైదరాబాద్ రోడ్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి మిల్లర్లు, స్మగ్లర్లు, పేకాట నిర్వాహకుల కాల్ డేటా సేకరించి వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. అంతేకాకుండా.. దాదాపు 40 మంది మహిళల వ్యక్తిగత సంభాషణలు విని వారిని బ్లాక్ మెయిల్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసినట్లు వెల్లడైంది.
గ్రేటర్ HYDలో బీర్ల అమ్మకాలు పెరిగాయి. లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మందుబాబులు మొగ్గు చూపుతున్నారు. ప్రతిరోజు గ్రేటర్‌లో 60 నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 20 వేల కేసులకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదని టాక్. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు అంటున్నారు.

మధిరలోని మైనర్ బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మధిర రాయపట్నంకు చెందిన మల్ల కార్తీక్ అనే యువకుడిపై మైనర్ బాలికను వేధించిన కారణంగా పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై సంధ్య తెలిపారు.
ప్రేమిస్తున్న యువతి తనను తిరస్కరించిందని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. అల్లీనగర్‌లో ఉండే సయ్యద్ షరీఫ్ కుమారుడు సోహెల్(20) మామిడిపల్లిలో ఓ కంపెనీ ఉద్యోగి. స్థానికంగా ఓ యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఈనెల 6న ఆ యువతిని కలిసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తిరస్కరించడంతో ఉరేసుకుని చనిపోయాడు.
Sorry, no posts matched your criteria.