Telangana

News August 11, 2024

మెట్‌పల్లి: గురుకులంలో బయటపడుతున్న పాములు

image

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల ఆవరణలో ముళ్లపొదలు, శిథిల భవనాలను కూల్చివేయడం, మురికి కుంటను పూడ్చే క్రమంలో పాములు బయటకు వస్తున్నాయి. శనివారం కొన్ని పాములు బయటకు రాగా అందులో నాలుగింటిని చంపేశారు. ఇంకా పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని బయటపడే అవకాశం ఉందంటున్నారు. ఇలా పాములు కనిపిస్తుండటంతో విద్యార్థులు పాము కాటుతోనే ప్రమాదానికి గురయ్యారని భావిస్తున్నారు.

News August 11, 2024

MBNR: నాలుగేళ్లు ప్రేమ.. పెళ్లి చేసుకోకుండా మోసం !

image

ప్రేమపేరుతో ఓ యువతిని మోసం చేసిన ఘటన నవాబ్ పేట మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై విక్రం తెలిపిన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన షేక్ ముస్తఫా అనే యువకుడు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. తాజాగా మతం అడ్డొస్తుందని పెళ్లి చేసుకోకుండా యువతి మోసం చేశాడు. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు.

News August 11, 2024

ర్యాగింగ్‌తో భవిష్యత్‌ అంధకారం: మెదక్ SP

image

జిల్లాలో ర్యాగింగ్ నిరోధించడానికి పోలీస్‌ అధికారులతో విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇస్తామని మెదక్ ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ‘ఇది అత్యంత అమానుష చర్య. ర్యాగింగ్ నియంత్రణలో స్కూల్, కాలేజీల యాజమాన్యం భాగస్వాములు కావాలి. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు, ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలి. ర్యాగింగ్‌కు పాల్పడే వారి వివరాలు డయల్‌ 100, కంట్రోల్‌ రూం 8712657888కి సమాచారం అందించాలి’ అన్నారు.

News August 11, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 3,583 క్యూసెక్కుల వరద నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా నిన్న తగ్గు ముఖం పట్టిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం ప్రాజెక్టులో 3,583 క్యూసెక్కులకు చేరుకుంది. అవుట్ ఫ్లో 3,583 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 47.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News August 11, 2024

HYD: రూ.50 కోట్ల బడ్జెట్.. మరో 10 MMTS రైళ్లు!

image

రాష్ట్ర ప్రభుత్వం MMTS రెండో దశ పనుల కోసం దాదాపు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. సీతాఫల్మండి, మౌలాలి మధ్య రెండో లైన్ నిర్మాణం, సికింద్రాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మౌలాలి, సనత్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లభించనుంది. ఈ మార్గాల్లో 10 MMTS రైళ్ల వరకు కొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News August 11, 2024

HYD: రూ.50 కోట్ల బడ్జెట్.. మరో 10 MMTS రైళ్లు!

image

రాష్ట్ర ప్రభుత్వం MMTS రెండోదశ పనుల కోసం దాదాపు బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించింది. సీతాఫల్మండి, మౌలాలి మధ్య రెండో లైన్ నిర్మాణం, సికింద్రాబాద్, మేడ్చల్, సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మౌలాలి, సనత్ నగర్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లభించనుంది. ఈ మార్గాల్లో 10 MMTS రైళ్ల వరకు కొనేందుకు వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News August 11, 2024

NZB: గ్రామాల్లో పంచాయతీ హడావుడి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల జోరు ఊపందుకుంది. పంచాయతీల వారీగా.. సెప్టెంబర్, అక్టోబర్‌లోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయని వార్తలు గుప్పుమనడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. ఓటర్లను ఆకర్షించేందుకు గ్రామాల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ప్రత్యేక అధికారులు ఉన్నప్పటికీ గత 6 నెలలుగా సర్పంచ్‌లు లేక అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి.

News August 11, 2024

తిరుమల శ్రీవారి సేవలో గెల్లు శ్రీనివాస్ యాదవ్

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల శ్రీ స్వామి వారిని రాష్ట్ర టూరిజం సంస్థ మాజీ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

News August 11, 2024

‘నల్గొండ’కు జ్వరమొచ్చింది!

image

జిల్లా వ్యాప్తంగా విషజ్వరాల బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. జిల్లాలో ఇటీవల ముసురుతో కూడిన వర్షాలతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో దోమల వ్యాప్తి పెరిగింది. దీంతో జిల్లాలో ఎక్కువగా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్ ప్రబలుతున్నాయి. కీళ్లనొప్పులు, కాళ్లు, ఒంటి నొప్పుల కారణంగా వందలాది మంది రోగులు నడవలేక అల్లాడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 466 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.

News August 11, 2024

బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి

image

వాజేడు మండలం చీకుపల్లి గ్రామ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తోంది. పచ్చని చెట్లు ఎత్తయిన రెండు కొండల మధ్య మంచి రాళ్ల మీదుగా ఎగిసి పడుతున్న జలపాతం అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం బొగత సందర్శనకు అధిక సంఖ్యలో తరలివచ్చారు.