Telangana

News April 8, 2024

గ్రీవెన్స్ డే రద్దు: SP చందనా దీప్తి

image

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతీ సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు ముగిసేవారు వరకు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరగదని తెలిపారు.

News April 8, 2024

ఉమ్మడి జిల్లాలో చికెన్ ప్రియులకు చుక్కలు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చికెన్ ధర రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో హరీస్ తయారీకి ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. చికెన్ రూ.350వరకు పెరిగే అవకాశం ఉంది. కోళ్ల ఎగుమతిలో రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు మొదటి స్థానంలో ఉంది.

News April 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ఖమ్మంలో ఎంపీ రవిచంద్ర పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News April 8, 2024

KMM: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ముత్యాలగూడెంకు చెందిన చిన్నబాబు(58) ఎండ తీవ్రతకు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అదే విధంగా ఇల్లెందు అడ్డరోడ్డు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రహదారి పక్కనే వడదెబ్బకు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 8, 2024

నేలకొండపల్లిలో అత్యధికం.. వేంసూరులో అత్యల్పం ఉష్ణోగ్రతలు

image

రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఖమ్మం జిల్లా రెండవ స్థానంలో ఉంది. నేలకొండపల్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వేంసూరులో 41.2 ఉష్ణోగ్రత నమోదయింది. మార్చి నెలలో రాష్ట్రంలో కెల్లా ఖమ్మం జిల్లాలోని అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అంటే 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.

News April 8, 2024

సాగర్ ఎడమ కాలువకు నీరు నిలిపివేత

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. ఈనెల 1వ తేదీ నుంచి వారం రోజులపాటు కాలువకు నీటిని విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆయకట్టు పరిధిలోని తాగునీటి కోసం పెద్ద దేవులపల్లి చెరువుతోపాటు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయం నింపేందుకు వారం రోజుల్లో 2.23 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.

News April 8, 2024

HYD: పోలీసులకు హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు  

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి HYD మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

News April 8, 2024

HYD: పోలీసులకు హీరో విజయ్ దేవరకొండ మేనేజర్ ఫిర్యాదు

image

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి HYD మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

News April 8, 2024

శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం సిద్ధం

image

భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉగాది రోజున శాస్త్రోక్తాoగా అంకురార్పణ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులన్నీ పూర్తి కాగా ఆదివారం రాత్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కాగా మంగళవారం నుంచి ఈనెల 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, పవళింపు సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.

News April 8, 2024

భద్రాచలం: శ్రీరామనవమి ప్రత్యేక రైళ్లేవి ?

image

శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామభక్తులు అసహన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!