Telangana

News April 8, 2024

శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం సిద్ధం

image

భద్రాచలంలో ఈనెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఉగాది రోజున శాస్త్రోక్తాoగా అంకురార్పణ చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులన్నీ పూర్తి కాగా ఆదివారం రాత్రి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. కాగా మంగళవారం నుంచి ఈనెల 23 వరకు స్వామివారి నిత్య కళ్యాణం, పవళింపు సేవలు నిలిపివేయనున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు వెల్లడించారు.

News April 8, 2024

భద్రాచలం: శ్రీరామనవమి ప్రత్యేక రైళ్లేవి ?

image

శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలం వస్తుంటారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో భక్తులు వచ్చే పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రామభక్తులు అసహన వ్యక్తం చేస్తున్నారు.

News April 8, 2024

TRR: ఆర్టీసీ బస్సుపై ప్రయాణికుల దాడి

image

తొర్రూరు నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే రూట్‌లో సక్రమంగా బస్సులు నడపటం లేదు దీంతో బస్సులు సకాలంలో రావడం లేదని ప్రయాణికులు తొర్రూరులోని ఆర్టీసీ బస్టాండ్‌లో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. బస్సులో సంఖ్యకు మించి బయల్దేరనున్న క్రమంలో తమను కూడా ఎక్కించుకోవాలని పలువురు వాదిస్తూ బస్సు అద్దాలపై కొట్టడంతో ముందు భాగంలో ఉన్న రెండు అద్దాలు పగిలిపోయాయి.

News April 8, 2024

బ్యాక్ లాక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈనెల26 తుది గడువు

image

డా. బీఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరిన విద్యార్థులు, పునఃప్రవేశం పొందిన విద్యార్థులు
బ్యాక్ లాక్ పరీక్షల ఫీజు ఈ నెల 26వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డా.జి. సత్యనారాయణగౌడ్ తెలిపారు. విద్యార్థులు తమ సమీప ఆన్లైన్ కేంద్రాల్లో పేపరుకు రూ.150 చొప్పున చెల్లించాలని అన్నారు.

News April 8, 2024

HYD: ప్రారంభానికి నోచుకోని రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రం

image

రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.

HYD: మోసం చేసే పార్టీ కాంగ్రెస్: రాణి రుద్రమ దేవి

image

అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను బొంద పెట్టారని మండిపడ్డారు.

బోధన్: కారులో ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఊపిరాడక చిన్నారి మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో చోటుచేసుకుంది. రాకాసిపేటకు చెందిన రాఘవ(6) ఆడుకుంటూ వెళ్లి రోడ్డుపై ఉన్న ఓ కారులో ఎక్కి కూర్చున్నాడు. కారు తలుపులు బిగుసుకు పోవడంతో ఊపిరి ఆడక కారులోనే మృతి చెందాడు. కారులో చిన్నారిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు సీఐ వీరయ్య తెలిపారు.

News April 8, 2024

మంచిర్యాల: మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన అధికారి

image

మహిళ ఉద్యోగితో బూట్లు కడిగించిన ఘటన మందమర్రి ఏరియా కేకే 5 గనిలో జరిగింది. గని కార్యాలయ సూపరింటెండెంట్‌ అదే ఆఫీస్‌లో ప్యూన్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగితో తన బూట్లు కడిగించాడు. ఆ అధికారి తీరుతో కలత చెందిన ఆమె ఈ విషయాన్ని పలువురు కార్మికసంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

error: Content is protected !!