India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు IPL చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ఉందన్నారు.
కొత్తూర్, నందిగామ మండలాల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి బాటలో నడిపించే బాధ్యత నాదని, నన్ను ఆశీర్వదదించి , పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు. ఉమ్మడి మండల ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
చర్ల మండల పరిధిలోని జీపీ పల్లి గ్రామంలో ఆదివారం రెండు తలలు, ఆరు కాళ్ళతో లేగదూడ జన్మించింది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఆవు ఆదివారం తెల్లవారుజామున ఈనింది. పుట్టిన లేగదూడ రెండు తలలు, ఆరు కాళ్ళతో ఉంది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి ఇంటికి తండోపతండాలుగా తరలి వచ్చి లేగ దూడను చూశారు. కాగా లేగదూడ పుట్టిన గంట తర్వాత మృతి చెందిందని బోరా శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సాపూర్ నుండి సంగారెడ్డి వైపు వెళ్లే రహదారిలో పెట్రోల్ బంక్ ముందు అతివేగంగా వచ్చిన బోర్‌వెల్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.13,13,950 నగదు, రూ.2,34,159 విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని, ఇద్దరిపై కేసులు నమోదు చేశామన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని తెలిపారు.

రామయంపేట 44వ జాతీయ రహదారిపై సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సమాచారంతో రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి గుజరాత్ వెళ్తున్న ఒక లారీలో 304 క్వింటాల్ రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. లారీ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
భార్యను భర్త హతమార్చిన ఘటన HYD ఉప్పల్ PS పరిధి రామంతాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్‌లో శివలక్ష్మి, శివమోహన్ శర్మ దంపతులు నివాసం ఉంటున్నారు. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెపై దాడి చేసి చంపేశాడు. ఈ విషయాన్ని కొడుకు సాయి గణేశ్‌కు తెలిపిన శివమోహన్ అనంతరం పరారయ్యాడు. విగత జీవిగా ఉన్న తల్లిని చూసి కుమారుడు విలపించాడు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వేదికగా కాంగ్రెస్ నేతలు మరో మోసానికి తెరలేపారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటి మూటలని తేలిపోయిందన్నారు. మంత్రులకు ఐపీఎల్ చూడటానికి ఉన్న ప్రాధాన్యం.. రైతులపై లేదని అన్నారు. జేబు దొంగల్లా కాంగ్రెస్ దుర్మార్గపు పాలన ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.