Telangana

News July 24, 2024

పార్లమెంట్ వద్ద నిరసనలో పాల్గొన్న వరంగల్ ఎంపీ కావ్య

image

కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో తోటి ఎంపీలతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పాల్గొన్నారు. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కావ్య మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన తెలిపారు.

News July 24, 2024

బిచ్కుంద: కరెంట్ షాక్ తగిలి రైతు మృతి

image

కరెంట్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన బిచ్కుంద మండలంలో మంగళవారం జరిగింది. SI మోహన్ రెడ్డి వివరాలిలా.. మండలంలోని రాజాపూర్ వాసి కొత్త రాములు అతని పొలంలో నాటు వేస్తుండగా.. పొలం మధ్యలో పడి ఉన్న కరెంట్ వైరును గమనించాడు. దాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

News July 24, 2024

అన్నపూర్ణ క్యాంటీన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లా కేంద్రంలోని రైతు బజార్ పక్కన ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ ను బుధవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ పెడుతున్న రూ.5ల భోజనాన్ని పరిశీలించారు. భోజనం చేస్తున్న వారిని భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ పరిసరాలలో పూర్తి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

మందమర్రి: సింగరేణి సేవా సమితి ద్వారా మహిళలకు రాత పరీక్షలు

image

మందమర్రి ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా 2023-24ఆర్థిక సంవత్సరంలో వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ పొందిన మహిళలకు రాత పరీక్షలు నిర్వహించారు. అనంతరం శిక్షణ పొందిన 187 మంది మహిళలకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. జీఎం ఏ.మనోహర్, సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ.. మహిళలు అవకాశాలను వినియోగించుకుని స్వయం ఉపాధి సంపాదించుకుని కుటుంబాలకు మార్గదర్శకంగా నిలబడాలన్నారు.

News July 24, 2024

ఆగస్టు 15 నాటికి రూ.50 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం: కలెక్టర్

image

ఆగస్టు 15 నాటికి ₹50 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, అర్హులను వెంటనే గుర్తించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో బుధవారం మహిళా శక్తి పథకం కింద రుణాలను మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆర్ఎచ్ అరుణ సవితా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్‌లు, ఎస్ఈఆర్పీ, మెప్మా బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పలువురు బ్యాంక్ అధికారులు తదితరులున్నారు.

News July 24, 2024

ఆదిలాబాద్: కేంద్ర రహదారుల శాఖ మంత్రిని కలిసిన ఎంపీ నగేశ్

image

కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ బుదవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. NH 44 బోరజ్ నుంచి ఉపాస్నాల (మహారాష్ట్ర) గల 33 కి.మీ. రోడ్డును కేవలం 2 వరసల రోడ్డు మాత్రమే మంజూరు చేసినందున.. దీనిని కూడా 4 వరసల రహదారులుగా మార్చాలని మంత్రికి విన్నవించారు. మంత్రి స్పందిస్తూ 4వరుసలుగా మార్చడానికి కొత్తగా మరో డీపీఆర్‌ను తయారు చేయవలసిందిగా అధికారులను ఆదేశించినట్లు ఎంపీ తెలిపారు.

News July 24, 2024

NRPT: ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు

image

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయుటకు అర్హులైన వైద్య నిపుణులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. డి రామ్ కిషన్ కోరారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 25 నుంచి ఆగస్టు3 వరకు ఉదయం 10 నుంచి సా.4 వరకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షణలో కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

News July 24, 2024

లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం: ప్రభుత్వం మహిళా శక్తి కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపిక  పకడ్బందీగా చేయాలని  జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని అధికారులతో మహిళా శక్తి కార్యక్రమ యూనిట్లపై సమీక్ష నిర్వహించారు. మండల వారిగా మహిళా శక్తి కార్యక్రమ కార్యాచరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతంలో ఉన్న డిమాండ్ ను బట్టి యూనిట్ల ఎంపిక చేయాలన్నారు.

News July 24, 2024

డిగ్రీ (CBCS) రివాల్యుయేషన్.. తేదీ ఇదే..!

image

TU పరిధిలోని డిగ్రీ (CBCS) రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ (రెగ్యులర్) ఒకటవ మూడవ, ఐదవ సెమిస్టర్ (బ్యాక్ లాగ్) పరీక్షల రివాల్యుయేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య ఎం. అరుణ బుధవారం తెలిపారు. ఆగస్టు 3 నుంచి 5 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రివల్యూషన్ ఫీజు ఒక్కొక పేపర్ కు రూ.500 చెల్లించాలని పేర్కొన్నారు.