Telangana

News August 29, 2024

వరంగల్ మార్కెట్లో క్రమంగా తగ్గుతున్న పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు మళ్ళీ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ. 7,600 పలకగా.. బుధవారం రూ.7,560 పలికింది. నేడు రూ. 5 తగ్గి రూ.7,555కి చేరినట్లు అధికారులు తెలిపారు. పత్తి ధరలు మళ్ళీ తగ్గుతుండడంతో రైతులు తీవ్రనిరాశ చెందుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.

News August 29, 2024

భూపాలపల్లి: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం

image

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో యూనియన్ నాయకులు, సింగరేణి కార్మికులు ఆదర్శ వివాహం జరిపించారు. కృష్ణ కాలనీకి చెందిన శృతి అనే సింగరేణి ఉద్యోగినితో మంచిర్యాలకు చెందిన సందీప్‌తో వివాహం జరిపించారు. శృతి వివాహం గురించి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ఏఐటీయూసీ యూనియన్ నాయకులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. కాగా, సింగరేణి ఉద్యోగి చంద్రమౌళి-లక్ష్మీ కన్యాదానం చేశారు.

News August 29, 2024

ADB: వృత్తి విద్య నిర్వహణకు నిధుల విడుదల

image

విద్యార్థులకు పాఠశాల స్థాయిలో చదువుతో పాటు వృత్తివిద్య శిక్షణ కోర్సులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 29 పాఠశాలల్లో కోర్సులు అమలు చేస్తోంది. ఆదిలాబాద్ 6, కొమురం భీమ్ 7, మంచిర్యాల 12, నిర్మల్ 4 పాఠశాలల్లో కోర్సులు అమలు అవుతున్నాయి. కోర్సుల నిర్వహణకు సంబంధించి సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.11.62 లక్షల నిధులు విడుదలయ్యాయి.

News August 29, 2024

రేపు యాదాద్రిలో ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు

image

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ సామూహిక ఉచిత వ్రతాల నిర్వహణకు దేవస్థానం నిర్ణయించింది. యాదాద్రి కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళా భక్తులు తమ పేర్లను గురువారం సాయంత్రం 5 గంటల లోగా నమోదు చేసుకోవాలని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

News August 29, 2024

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూత్పూర్ మండలం తాటికొండ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.

News August 29, 2024

సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని సీఎంకు వినతి

image

రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో దాదాపు 6 వేల మంది సెకండ్ ANMలు పనిచేస్తున్నారని వీరందరినీ రెగ్యులర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో సెకండ్ ANMలను రెగ్యులర్ చేశారని.. మన రాష్ట్రంలో కూడా సెకండ్ ANMలను రెగ్యులర్ చేయాలన్నారు.

News August 29, 2024

HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు

image

విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News August 29, 2024

HYD: విమానం అత్యవసర ల్యాండింగ్.. దక్కని ప్రాణాలు

image

విమానంలో ఓ ప్రయాణికురాలిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. సిబ్బంది తెలిపిన వివరాలు.. కేరళకు చెందిన సోషమ్మ(89) బుధవారం కొచ్చి నుంచి ఓ విమాన సర్వీస్‌లో అమెరికాకు బయలుదేదారు. ప్రయాణంలో సోషమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పైలట్.. శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. సోషమ్మను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News August 29, 2024

MDK: మళ్లీ ‘ప్రజాపాలన’.. రేషన్ కార్డులు దక్కేనా..?

image

సెప్టెంబర్ 17 నుంచి పది రోజులు మళ్లీ ప్రజాపాలన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారైనా కొత్త రేషన్ కార్డులు అందుతాయన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండవ విడత ప్రజాపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటిసారి ప్రజాపాలనలో మెదక్ జిల్లాలో ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా రేషన్ కార్డుల కోసం 2.23.357 దరఖాస్తులు వచ్చాయి.

News August 29, 2024

HYD తర్వాత నల్గొండ జిల్లా వాసులే అధికం

image

నల్గొండ జిల్లాలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ తర్వాత మూత్రపిండాల చికిత్స పొందుతున్న వారిలో అధికంగా ఈ జిల్లా వాసులే ఉన్నట్లు ఇటీవల నేమ్స్ ఆసుపత్రి బృందం నిర్వహించిన సర్వేలో తేలింది. జిల్లాలో పీపీపీ పద్ధతిలో 55 పడకల ద్వారా నిత్యం 472 మందికి డయాలసిస్ నిర్వహిస్తున్నారు. NLG పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది.