Telangana

News August 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలీలా..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా గట్టులో 126 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్లలో 86.3 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 82.0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా గోపాల్ పేట పేటలో 71.5 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా వట్వర్లపల్లిలో 69.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

News August 7, 2024

HYD: BRS పనైపోయింది: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో BRS పనైపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలో ఆయన మాట్లాడారు. BJPకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నామని, ప్రజలు BJPని ఆదరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. మీ కామెంట్?

News August 7, 2024

నిందితులకు శిక్ష పడాల్సిందే: మెదక్ SP

image

నిందితులకు శిక్షపడేలా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది కృషి చేయాలని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందికి DGP నిన్న ప్రశంసా పత్రాలు అందజేశారు. SP మాట్లాడుతూ.. 2023లో హత్య కేసులో రామాయంపేట CI చంద్రశేఖర్, 2021లో మరో కేసులో తూప్రాన్ DSP కిరణ్ కుమార్.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. నేర రహిత సమాజం కోసం నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పనిచేయాలన్నారు.

News August 7, 2024

HYD: BRS పనైపోయింది: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో BRS పనైపోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. HYD నాంపల్లిలో ఆయన మాట్లాడారు. BJPకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నామని, ప్రజలు BJPని ఆదరిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. మీ కామెంట్?

News August 7, 2024

KU: 12 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU డిగ్రీ (థియరీ) 6వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.తిరుమల దేవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News August 7, 2024

వరంగల్ మార్కెట్‌లో పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు మంగళవారం రూ.18,500 పలకగా.. నేడు రూ.17,500కి తగ్గింది. అలాగే 341 రకం మిర్చికి నిన్న రూ.14 వేలు పలకగా.. నేడు రూ.15 వేలకు చేరింది. నిన్న రూ.14,800 ధర పలికిన వండర్ హాట్(WH) మిర్చి.. నేడు రూ.15,500కి పెరిగింది.

News August 7, 2024

దరఖాస్తులకు మరో రెండు రోజులు గడువు!

image

నేతన్న బీమా పథకానికి ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళిశాఖ ఏడీ ఎస్.ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. చేనేత, మర మగ్గాలు వాటి అనుబంధ కార్మికులు 18 నుంచి 59 ఏళ్లలోపు వారు పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఈ పథకంలో నమోదైన కార్మికులు ఏదైనా కారణంతో మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా వస్తుందని తెలిపారు.

News August 7, 2024

తలమడుగు: ఎడ్ల బండిపైనే ఆగిన రైతు గుండె

image

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామానికి చెందిన రైతు గోక సంజీవ రెడ్డి (48) వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండిపై పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో ఎడ్ల బండిపై ఉండగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 7, 2024

పారిస్ ఒలంపిక్స్‌‌లో జితేందర్ రెడ్డి సందడి

image

పారిస్‌లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడల్లో మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి సందడి చేశారు. ప్రస్తుతం ప్యారిస్ పర్యటనలో ఉన్న ఆయన ఒలంపిక్స్ క్రీడలను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ క్రమంలో ఆయనతోపాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డి, వీసీఎండీ సోనీ బాలాదేవి, అధికారులు శానవాజ్, వేణుగోపాల చారి, తదితరులు ఉన్నారు.

News August 7, 2024

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర తటస్థంగా ఉంది. మంగళవారం లాగే ఈరోజు క్వింటా పత్తి ధర రూ. 7,100 పలికింది. సోమవారం రూ.7,160 పలికిన పత్తి.. నిన్న, ఈ రోజు రూ. 7100కి పడిపోయింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నాణ్యమైన, తేమ లేని సరుకులు మార్కెట్‌కు తీసుకువచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.