India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో అన్ని ప్రభుత్వ చౌకధర దుకాణాలకు ఆగస్టు నెల కోటా బియ్యాన్ని ఈనెల 31 వరకు సరఫరా చేయాలని డీఎస్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. పట్టణంలోని మండల గోదాంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అన్ని చౌకధర దుకాణాల్లో కార్డుదారులకు బియ్యం పంపిణీ చేయాలన్నారు. ఆగస్టు నెలకు జిల్లాకు 6836.36 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారన్నారు.

బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఎస్ఐ చంద్రశేఖర్ వివరాలు ప్రకారం.. భూత్పూర్ మండలంలోని శేరిపల్లి(హెచ్)కి చెందిన సాయితేజ(21) బైక్‌పై భూత్పూర్ చౌరస్తా నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్నాడు. ఈక్రమంలో ఇంటర్నల్ రోడ్డుపై బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

కృష్ణానదిలో రోజురోజుకు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం నాటికి 862 అడుగుల మేర నీళ్ల నిల్వ ఉంది. 865 అడుగుల మేర వరద జలాల ప్రవాహం ఉండటంతో సప్తనదుల ప్రాంతంలో సంగమేశ్వర క్షేత్రం పూర్తిగా మునుగుతుందని పురోహితులు రఘురామ శర్మ చెప్పారు. సంగమేశ్వర క్షేత్రంతో పాటు సోమశిల, జటప్రోల్‌లో పురాతన దర్గాలు, సురభిరాజుల కట్టడాలు పూర్తిగా ముంపునకు గురవుతాయని తీర గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీసీసీబీ బ్యాంకులో మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీర్మానం జీవోలు జారీ చేయగా వాటిని డీసీసీబీ ఛైర్మన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. నాబార్డు డీడీఎం సత్యనారాయణ, డీసీఓలు తదితరులు పాల్గొన్నారు.

ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మసస్తాపం చెందిన యువతి పురుగు మందు తాగింది. సిద్దిపేట 3-టౌన్ CI తెలిపిన వివరాలు.. కొండపాక మండలానికి చెందిన యువతి, ఖమ్మంపల్లి వాసి నితీశ్ ప్రేమించుకున్నారు. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా యువకుడు నిరాకరించాడు. యువతి తల్లిదండ్రులు మాట్లాడినా యువకుడు పెళ్లికి నో చేప్పడంతో ఈనెల 10న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. కేసు నమోదైంది.

జూరాల జలాశయంలోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయంలోకి 2.65 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 36 గేట్లు ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా 20 వేలు కలిపి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 6.554 టీఎంసీల మేర ఉంది. ఆల్మట్టి జలాశయానికి 2.75 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుందని జూరాల అధికారులు వివరించారు.

రేబిస్ వ్యాధితో ఓ మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. ఏడ్చెర్ల గ్రామానికి చెందిన పూలమ్మ అనే మహిళపై ఇటీవల ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మహబూబాబాద్ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నయం కాకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కులం పేరుతో దూషించి, పొలంలోని పైపులకు నిప్పు పెట్టిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి శ్రీనివాస్ ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4,700 జరిమానా విధించారు. ఏర్గట్లలోని తొర్తి గ్రామానికి చెందిన చిన్న లింబన్న అదే గ్రామానికి చెందిన చిన్న సాయన్న పొలంలోని పైపులను కాల్చేశాడు. ఎందుకు కాల్చావని సాయన్న అడిగితే అతడిని కులం పేరుతో దూషించాడు. దీంతో సాయన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం పుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.. ఈ నెల 10 నుంచి 23 వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు కూడా టెండర్లు వేసేందుకు ముందుకురాలేదు.

కేయూ పీజీ (MA/M.Com/M.Sc) రెండో సెమిస్టర్ పరీక్షా టైం టేబుల్ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహచారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బీఎస్ఎల్. సౌజన్య విడుదల చేశారు. ఆగస్టు 7న మొదటి పేపర్, 9న రెండో పేపర్, 12న మూడో పేపర్, 14న నాల్గో పేపర్, 16న ఐదో పేపర్, 19న ఆరో పేపర్ పరీక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
Sorry, no posts matched your criteria.