India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో LLB 5 ఏళ్ల కోర్సు మొదటి, ఐదో సెమిస్టర్ పరీక్షలు, మూడు ఏళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్ విద్యార్థులు) పరీక్షలు ఈ నెల 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహాచారి వెల్లడించారు.
భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పార్టీ మార్పుపై కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టేకి వెళితే వెంటనే వారు అనర్హులయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ద్వంద నీతిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గెలవక ముందు ఒకలా గెలిచాక ఒకలా కాంగ్రెస్ పరిస్థితి ఉందని.. హస్తం పార్టీకి బీజేపీకి తేడా ఏంటని ప్రశ్నించారు.
కరెంట్ షాక్‌తో బాలింత మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎలిగేడు మండలం శివపల్లికి చెందిన పరమేశ్వరి, వెంకటేశం దంపతుల కుమార్తె కీర్తిని రామగుండానికి చెందిన స్వాగత్‌కు ఇచ్చి 2021లో పెళ్లి చేశారు. కీర్తి ఆడబిడ్డకు జన్మనివ్వగా.. ఈ నెల 1న పుట్టినింట్లో సంప్రదాయ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం రాత్రి కీర్తి స్నానం చేయడానికి వెళ్లగా.. విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై మృతి చెందారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన సుభాశ్ రెడ్డి ఈ రోజు ఉదయం తన ఇంట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇంట్లో మంటలు రావడంతో గమనించిన స్థానికులు అంబులెన్సు సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ప్రథమ చికిత్స అందించి అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. ఆదివారం ఉదయం నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 511.20 అడుగులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు గాను 133.7164 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులుగా ఉంది.
ఈ నెల 18న రాష్ట్రంలోని అన్ని లోక్ సభ స్థానాల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో NLG, BNG, SRPT జిల్లాల అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు. మే 13న నిర్వహించే పోలింగ్, జూన్ 3న కొనసాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను పటిష్ఠంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, ఒక అసిస్టెంట్ పీవో, ఇద్దరు సహాయ ప్రిసైడింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని, స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ వ్యతిరేక చర్య కిందికి వస్తుందన్నారు.
హైదరాబాద్‌లోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఓల్డ్ సిటీలోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఓల్డ్ సిటీలోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.