India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పట్టాదారు పాస్ బుక్ లేకున్నా రుణమాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అలాంటి రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు లోన్లు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందన్నారు. గత ప్రభుత్వం పంట వేయని భూములకు రూ.25వేల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. పంట వేసిన వారికే రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఆగస్ట్ 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు హన్మకొండ జిల్లా సంక్షేమ అధికారిణి కె.మధురిమ తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. అమృతం కన్నా విలువైంది అమ్మ పాలని, చంటి బిడ్డకు ఆరోగ్యంతో పాటు పోషణ అందించాలన్నారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలని “అంతరాలను తొలగించి తల్లిపాల ప్రాముఖ్యతను చాటుదాం” అనే నినాదంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సైబర్ మోసగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారని DSP జీవన్‌రెడ్డి తెలిపారు. కేటుగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి మీ కుటుంబీకులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారని వారిని విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈరకమైన కాల్స్ పోలీస్, ఇతర అధికారులు చేస్తు మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్‌కాల్స్ వస్తే ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే నిర్ధారించుకోవాలన్నారు.

సీఎం రేవంత్ మహిళ లోక విరోధి అని
నిజామాబాద్ BRS లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్ రావు ఆరోపించారు. మహిళల సాధికారతను జీర్ణించుకోలేని సీఎం తన మహిళ వ్యతిరేకతను అసెంబ్లీ సాక్షిగా చాటుకున్నారన్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన తీరు మహిళల పురోగతిని, రాజకీయ చైతన్యాన్ని అడ్డుకునే అహంభావం ఉందని ఆక్షేపించారు.

◆మద్నూర్: రూ. వెయ్యి కోసం వ్యక్తి హత్య
◆చూపరులను కట్టిపడేస్తున్న సిర్నాపల్లి జలపాతం
◆NZB: నిరుద్యోగుల కోసం ఆగస్టు 2న జాబ్ మేళా
◆మద్యం మత్తులో కాలువలో పడి యువకుడు మృతి
◆నిజామాబాద్ జిల్లాలో జోరందుకున్న వరినాట్లు
◆కామారెడ్డి: విషాదం..పోస్టుమ్యాన్ మృతి
◆పిట్లం: కారులో వచ్చి ఆవును ఎత్తుకెళ్లారు (సీసీ ఫుటేజీ)
◆నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలు

@ డెంగ్యూ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో కారు, బైకు ఢీ.. ఒకరికి గాయాలు.
@ వీణవంక మండలంలో బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలు.
@ కోనరావుపేట మండలంలో బావిలో పడిన కుక్కను రక్షించిన పోలీసులు.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.

◆ ఆదిలాబాద్: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
◆ ఆసిఫాబాద్: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం
◆ బోథ్: రెండు ఆటోలు ఢీ కూలీలకు గాయాలు
◆ ఉట్నూరు: రోడ్డుప్రమాదం ఇద్దరికి తీవ్రగాయాలు
◆ మామడ :విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి
◆ బాసర: గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య
◆ అదుపు తప్పిన నిర్మల్ వస్తున్న RTC బస్సు
◆ ఆందోళనకు గురిచేస్తున్న పాముకాటు ఘటనలు
◆ లక్షెట్టిపేట: గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ
◆ నిర్మల్: 30యాక్ట్ అమలు

> WGL: ఆటో, బైక్ ఢీ.. విద్యార్థులకు గాయాలు
> JN: రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
> WGL: ఇంట్లో దూరిన కొండచిలువ
> MHBD: సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాలు
> MLG: గుడుంబా స్థావరాలపై దాడులు.. ముగ్గురిపై కేసు
> WGL: శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న వ్యక్తిపై రౌడీషీట్
> JN: పెట్రోల్ బంకులో చోరీ ఇద్దరు అరెస్ట్

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతుంది. ప్రాజెక్టు నుంచి ఎనిమిది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జలాశయానికి ఇన్‌ఫ్లో 2.93 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఓట్ ఫ్లో 2.84 లక్షల క్యూసెక్కులుగా ఉందన్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 855 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.50 అడుగులకు చేరిందని అధికారులు వివరించారు.
Sorry, no posts matched your criteria.