India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రామగుండం సింగరేణి సంస్థ 2వ భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండవ షిఫ్ట్ విధులు నిర్వహించేందుకు వెళ్లిన నోయల్, శంకర్, సంపత్‌లకు పైకప్పు కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత ఆత్మహత్య.
@ నంది మేడారం పంప్ హౌస్ నుంచి నీరు విడుదల.
@ ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.
@ సౌదీలో బీర్పూర్ మండల వాసి అదృశ్యం.

విద్యార్థుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.విద్యాసాగర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న జరిగిన ఘటనపై విచారణ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్సైజ్ అంశంపై తీవ్రంగా స్పందించారు. బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు బడ్జెట్ అంచనాలు పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు తలదించుకోవాలని ఆయన విమర్శించారు.

భార్యను హత్య చేసిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ వనపర్తి ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి సునీత తీర్పు వెలువరించారని ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఎస్పీ వివరాలు.. రేవల్లికి చెందిన వెంకటయ్య, నిర్మలమ్మ భార్యభర్తలు NGKLలో పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన అతడు భార్యను డబ్బులు ఇవ్వాలన్నారు. ఇవ్వకపోవడంతో మద్యం మత్తులో భార్యను గడ్డపారతో పొడిచారని తెలిపారు.

కాంగ్రెస్ ముందుచూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ECIL, NFC వంటి కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కూడా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. BRS చేసిందేమీ లేదన్నారు. చాలా వరకు అమ్ముకున్నారని.. వదిలేస్తే హైటెక్‌సిటీని అమ్మేవారని భట్టి మండిపడ్డారు.

కాంగ్రెస్ ముందుచూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ECIL, NFC వంటి కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రోను తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు కూడా రూ. 10 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు ఆయన గుర్తుచేశారు. BRS చేసిందేమీ లేదన్నారు. చాలా వరకు అమ్ముకున్నారని.. వదిలేస్తే హైటెక్‌సిటీని అమ్మేవారని భట్టి మండిపడ్డారు.

భువనగిరి బస్టాండ్‌లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు. టాయిలెట్‌కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి, స్థానికులను అప్రమత్తం చేసింది. దుండగుడిని కిందకు లాగిన స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

ఎమ్మెల్సీలకు గౌరవ వేతనం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం శాసనమండలిలో ఆయన పలు సమస్యలను ఏకరువు పెట్టారు. షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును వచ్చే నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు కూడా అందించాలని సభలో పేర్కొన్నారు.

ప్రగతినగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి తల్లి వజ్రమ్మ మృతి చెందారు. శనివారం ఆమె భౌతికదేహాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి స్వచ్ఛందంగా మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు దానం చేశారు. మరణించిన తర్వాత దహనం చేయడం, సమాధి చేయడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం మేలు అని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మెడికల్ కళాశాల డీన్ హరికృష్ణ, వైస్ ప్రిన్సిపల్ నవీన్ వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.