Telangana

News August 10, 2024

బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ

image

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టులు హెచ్చరికలు చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనం రేపింది. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని మావోయిస్టు సింగరేణి డివిజన్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మండిపడ్డారు. ఢిల్లీలో మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గంలో రౌడీలను, గూండాలను ప్రోత్సహిస్తే బుద్ధి చెబుతామన్నారు. వినోద్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.

News August 10, 2024

BREAKING: ఏడుపాయల దేవాలయంలో చోరీ

image

మెదక్ జిల్లా ఏడుపాయల దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పాత కళ్యాణకట్ట, గర్భగుడి ముందు ఉన్న 2 హుండీలను ఎత్తుకెళ్లారు. హుండీలను ధ్వంసం చేసి వాటిలో ఉన్న నగదును తీసుకెళ్లారు. 10 రోజుల క్రితమే ఆలయ హుండీలను సిబ్బంది లెక్కించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పాపన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 10, 2024

HYD: వరదల నియంత్రణకు రూ.2,541 కోట్లు

image

దేశంలోని 6 ప్రధాన నగరాలైన HYD, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే ప్రాంతాల్లో వరదల నియంత్రణకు రూ.2,514.36 కోట్లతో కేంద్రం 6 ప్రాజెక్టులను రూపొందించింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతి అయోగ్ అధ్యక్షుడు సుమన్ బేరిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనుమతి లభించింది.రూ.470.50 కోట్లతో యువ ఆపద మిత్ర పథకంలో NCC,NSS,NYKS భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 2.37 లక్షల వాలంటీర్ల సేవలను ఉపయోగించనున్నారు.

News August 10, 2024

HYD: వరదల నియంత్రణకు రూ.2,541 కోట్లు

image

దేశంలోని 6 ప్రధాన నగరాలైన HYD, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే ప్రాంతాల్లో వరదల నియంత్రణకు రూ.2,514.36 కోట్లతో కేంద్రం 6 ప్రాజెక్టులను రూపొందించింది.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నీతి అయోగ్ అధ్యక్షుడు సుమన్ బేరిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అనుమతి లభించింది.రూ.470.50 కోట్లతో యువ ఆపద మిత్ర పథకంలో NCC,NSS,NYKS భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ చెందిన 2.37 లక్షల వాలంటీర్ల సేవలను ఉపయోగించనున్నారు..

News August 10, 2024

HYD జూబ్లీహిల్స్‌లో వ్యభిచార గృహంపై దాడి

image

HYD జూబ్లీహిల్స్‌లోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతులతో పాటు నిర్వాహకుడు చంద్రశేఖర్, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు. స్రవంతి నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో అధికారులు ఈ దాడులు చేపట్టారు. విటులు ఖమ్మంకి చెందిన నాగేశ్వరరావు, షేక్ సైదులు, ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎర్ర రాజుగా గుర్తించారు.

News August 10, 2024

ఉమ్మడి ADB జిల్లాలో నిండుగా జలాశయాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15 కు పైగా ప్రాజెక్టులు, వాగులు ఉన్నాయి. ఇవన్నీ కురుస్తున్న వర్షాలకు నిండి పోయాయి. వీటి పైనే ఆధారపడి అన్నదాతలు పంటలు సాగు చేస్తున్నారు. కడెం, స్వర్ణ, కొరాట చనఖా, సత్నాల, గడ్డెన్న, వట్టివాగు, పీపీరావు, నీల్వాయి, ర్యాలీ వాగు, ఎన్టీఆర్ , గొల్లవగు, ఎన్టీఆర్, జగన్నాథ్ పూర్, కొమరం భీం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో 6.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

News August 10, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

image

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 10, 2024

నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది నూతన గ్రామ పంచాయతీలు

image

పంచాయతీ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కోటగిరి మండలంలో కొత్తగా 8 పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి మండలంలో ఇప్పటి వరకు 28 పంచాయతీలుండగా ఆ సంఖ్య 36కు చేరింది. ఎత్తొండ క్యాంపు, ఎక్లాస్పూర్ క్యాంపు, శ్రీనివాస్ రెడ్డి కాలనీ, బాకర్ ఫారం, జల్లాపల్లి పాత గ్రామం, జల్లాపల్లి తండా, తిర్మలాపూర్, రాంగంగానగర్ కొత్తగా ఏర్పడ్డాయి.

News August 10, 2024

చింతకాని: కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి

image

కరెంటు షాక్‌కు గురై ఓ యువకుుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నామవరంకి చెందిన బొలికొండ బాను(28) ఈనెల 2 కరెంటు షాక్ గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

News August 10, 2024

వరంగల్: దేవాదాయ శాఖలో బదిలీలు

image

దేవాదాయ శాఖలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 8 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 6బి కేటగిరీకి వచ్చే దేవాలయాల నుంచి ఇద్దరు, రీజినల్ జాయింట్ కమిషనర్ పరిధిలోకి వచ్చే 6ఏ దేవాలయాల్లో ఆరుగురికి బదిలీలు జరిగాయి. వేయి స్తంభాల గుడిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ ఐనవోలుకు, ఐనవోలు ఆలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మధుకర్ వేయిస్తంభాల గుడికి వచ్చారు.